మర్డర్ కేసులో మొత్తం 17 మందిపై చార్జ్ షీట్!
17 మందిపై కోర్టులో చార్జ్ షీట్ ధాఖలు చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.
By: Tupaki Desk | 8 Aug 2024 9:33 AM GMTఅభిమాని రేణుకాస్వామి హత్య కేసులో పవిత్రాగౌడ్..నడుడు దర్శన్ సహా మరో 15 మంది అభియోగం ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరింతా పరప్పన్ అగ్రహారం జైలులో జ్యూడీషల్ ఖైదీలుగా ఉన్నారు. పలుమార్లు కోర్టు ముందు హాజరు పరచడం...రిమాండ్ ని పొడిగించడం జరిగింది. ఈనెల 14 తో రిమాండ్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కేసు ట్రయల్ కి రెడీ అవుతోంది. 17 మందిపై కోర్టులో చార్జ్ షీట్ ధాఖలు చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.
విచారణలో భాగంగా ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అయితే ఈ కేసును మరింత వేగం చేసేందుకు పాస్ట్ ట్రాక్ కోర్టుకు కేసును బదిలీ చేయాలని సిట్ ప్రభుత్వాన్ని కోరింది. అక్కడ నుంచి అనుమతి రాకపోతే ప్రస్తుతం విచారణ జరుగుతోన్న సివిల్ కోర్టులో అభియోగపత్రాన్ని దాఖలు చేసి పాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేయనుందని సమాచారం. దీంతో ఈ కేసు మరింత వేగంగా విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది.
అటు దర్శన్ భార్య విజయలక్ష్మి బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. టాప్ క్లాస్ లాయర్లను అందర్నీ రంగంలోకి దించిప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రయత్నాలేవి ఫలించడం లేదు. ఆ మధ్య కర్ణాటక ఉపముఖ్యమంత్రిని కూడా కలిసే ప్రయత్నం చేసారు. అయితే ఈ కేసు విషయంలో దర్శన్, పవిత్రలకు వ్యతిరేకంగా సాక్ష్యాలు అన్ని కనిపిస్తున్నాయి.
హత్య జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాన్ని తరలించడం వరకూ ఎన్నో ఆధారాలు సంపాదించారు. వేలి ముద్రలు సైతం మ్యాచ్ అయినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులు చెబుతున్నాయి. దీంతో ఈ కేసు మరింత జఠిలంగా మారింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి మాత్రం చాలా మంది సెలబ్రిటీలు దర్శన్ ఈ హత్య చేసి ఉండడని భావిస్తున్నారు. తమ నమ్మకమే నిజమవుతుందని పలువురు ధీమా వ్యక్తం చేసారు.