Begin typing your search above and press return to search.

అభిమాని హ‌త్య కేసు.. ద‌ర్శ‌న్ భార్య ఎట్ట‌కేల‌కు..!

ఇందులో అతడి సహనటి, సన్నిహితురాలు పవిత్ర గౌడ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 4:08 AM GMT
అభిమాని హ‌త్య కేసు.. ద‌ర్శ‌న్ భార్య ఎట్ట‌కేల‌కు..!
X

శాండల్‌వుడ్ స్టార్ దర్శన్ పై అభిమాని హ‌త్యా కేసు విచార‌ణ కొన‌సాగుతోంది. కొందరు దుండగుల‌తో క‌లిసి ద‌ర్శ‌న్ ..త‌న‌ అభిమాని రేణుకా స్వామిపై దారుణంగా దాడి చేసి హత్య చేయించార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో దర్శన్ నంబర్ 2 నిందితుడిగా ఉన్నాడు. ఇందులో అతడి సహనటి, సన్నిహితురాలు పవిత్ర గౌడ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

దర్శన్‌పై వచ్చిన హత్యా నేర‌ ఆరోపణలపై తొలిసారిగా దర్శన్ భార్య విజయలక్ష్మి స్పందించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో హత్య కేసుపై అనధికారిక సమాచారాన్ని ప్రచురించకుండా మీడియా సంస్థలపై సెషన్స్ కోర్టు జారీ చేసిన నిషేధాన్ని షేర్ చేసారు.

రేణుకాస్వామి కుటుంబానికి విజయలక్ష్మి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొన్ని రోజులుగా దర్శన్, నేను, నా టీనేజ్ కొడుకు .. దర్శన్ స్నేహితులు, కుటుంబం ..అభిమానులు అంద‌రూ తీర‌ని వేదనను అనుభ‌వించాం''అని విజయలక్ష్మి తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాశారు. మీడియా , నెటిజన్లు, ర‌క‌ర‌కాల‌ మీడియాలు, సోషల్ మీడియా వేదిక‌లలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారం, అవాస్తవాలను ప్రచురించడాన్ని ఆపివేయాలని విజ‌య‌ల‌క్ష్మి ఆకాంక్షించారు. విజయలక్ష్మి కుమారుడు వినీష్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసిన ఒక వారం తర్వాత ఆమె సోష‌ల్ మీడియాల్లో స్పందించారు. వినీష్ త‌న వ‌య‌సు కేవ‌లం15 సంవత్సరాలు అనేది కూడా పరిగణించని ట్రోల‌ర్ల‌కు 'ధన్యవాదాలు' చెప్పాడు.

భ‌ర్త‌తో విజ‌య‌ల‌క్ష్మి విభేధాలు:

ద‌ర్శ‌న్- పవిత్ర గౌడల సంబంధాన్ని ద‌ర్శ‌న్ భార్య విజ‌య‌ల‌క్ష్మి చాలాసార్లు నిర‌సించారు. ప‌విత్ర‌ తన కుటుంబాన్ని నాశనం చేసింద‌ని, తాను గృహ‌హింస‌కు గుర‌య్యాన‌ని ద‌ర్శ‌న్ భార్య విజ‌య‌ల‌క్ష్మి ఇంత‌కుముందు ద‌ర్శ‌న్ పై కేసు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప‌విత్ర‌తో ద‌ర్శ‌న్ సాన్నిహిత్యాన్ని క‌ట్టుకున్న భార్య‌ విజ‌య‌ల‌క్ష్మి బ‌హిరంగంగా తీవ్రంగా వ్యతిరేకించింది.