హత్య చేసి ఇంట్లో పూజలు కూడా చేసాడా?
వీటిని హత్య సమయంలో వాటిని వినియోగించినట్లు తెలుస్తోంది. వీటి రికవరీ కేసులో కీలక ఆధారలు పోలీసులు సంపాదించారు.
By: Tupaki Desk | 20 Jun 2024 11:26 AM GMTరేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో కన్నడ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి కూడా కీలక సాక్షంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శన్ వినియోగించిన లోఫర్స్ ని విజయలక్ష్మి ప్లాట్ వద్ద గుర్తించారు. వీటిని హత్య సమయంలో వాటిని వినియోగించినట్లు తెలుస్తోంది. వీటి రికవరీ కేసులో కీలక ఆధారలు పోలీసులు సంపాదించారు.
హత్య అనంతరం 9వతేదీ తెల్లవారు జామున రేణుకాస్వామి మృతదేహాన్ని పారేసి హోస్కెరహల్లిలోని భార్య విజయలక్ష్మి ప్లాట్ కు చేరుకున్నాడు. అక్కడ నుంచి మైసూరు బయల్దేరే ముందు ఇంట్లో పూజలు చేసాడు. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి కూడా పోలీసులు సమన్లు జారీ చేసి బుధవారం ఐదు గంటల పాటు విచారించారు. ఆ లోఫర్స్ ని కడిగారేమోనని అడిగి తెలుసుకున్నారు. హత్య అనంతరం కొన్ని దుస్తులు, పుట్ వేర్ ను దర్శన్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ రాజు తెచ్చి విజయలక్ష్మికి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో ఆమెను సాక్షిగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే దర్శన్ ప్యాన్ క్లబ్ లోను వారు కూడా కీలక పాత్ర పోషించడంతో పోలీసులు కన్ను ఇప్పుడు వారిపై కూడా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా దర్శన్ ఫ్యాన్ క్లబ్ కార్యకలాపాలపై కూడా దృష్టి సారించారు. వీరందరికీ దర్శన్ తో పాటు, అతడి దర్శక, నిర్మాతల నుంచి ఆకర్షణీయమైన మొత్తాలు అందుతున్నట్లు గుర్తించారు.
దీంతో కేసు మరింత సంచలనంగా మారింది. ఇప్పటికే కేసులో 16 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. విజయలక్ష్మి కూడా హత్య గురించి తెలిసే అవకాశం ఉండటంతో ఆమె కీలకంగా మారుతుంది. అలాగే సహకరించిన అభిమానులు కూడా కేసులో కీలకం కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తీగ లాగితే పెద్ద ఢొంక కదులుతున్నట్లు కనిపిస్తుంది. విచారణ పూర్తయ్యే లోపు ఇంకెన్ని పేర్లు తెరపైకి వస్తాయో అన్న సందేహాలు వ్యక్తంమవుతున్నాయి. మరోవైపు దర్శన్ , విజయలక్ష్మిపై అటవీశాఖ చట్టానికి సంబంధించిన కేసు కూడా ఫైల్ అయిన సంగతి తెలిసిందే.