Begin typing your search above and press return to search.

టాలీవుడ్@దసరా.. వారూ ఉంటేనే ఫుల్ మజా!

తమ సినిమాలతో అలరిస్తారు. వారితోపాటు మీడియం, చిన్న రేంజ్ కథానాయకుల సినిమాలు కూడా రిలీజ్ అవుతుంటాయి.

By:  Tupaki Desk   |   18 Sep 2024 5:30 PM GMT
టాలీవుడ్@దసరా.. వారూ ఉంటేనే ఫుల్ మజా!
X

సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి, సమ్మర్ తర్వాత వచ్చే పెద్ద బాక్సాఫీస్ సీజన్ దసరా. పొంగల్ తర్వాత ఎక్కువ సెలవులు దసరాకు రావడంతో మేకర్స్ తోపాటు హీరోలు తమ సినిమాలను అప్పుడే విడుదల చేసేందుకు రెడీ అవుతుంటారు. అందుకు తగ్గట్లు ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. బడా హీరోలు కచ్చితంగా ఏటా దసరా బరిలో దిగుతారు. తమ సినిమాలతో అలరిస్తారు. వారితోపాటు మీడియం, చిన్న రేంజ్ కథానాయకుల సినిమాలు కూడా రిలీజ్ అవుతుంటాయి.

అయితే ఈసారి.. బడా హీరోలు ఎవరూ రావడం లేదు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సందడి చేయనున్నా.. తెలుగు పెద్ద హీరోలు తమ చిత్రాలతో బరిలోకి దిగడం లేదు. రజినీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న వెట్టయాన్.. అక్టోబర్ 10వ తేదీన విడుదల కానుంది. రీసెంట్ గా ఆ మూవీ నుంచి విడుదలైన మనసిలోయో సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ సినిమాతోపాటు దసరాకు నాలుగు టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ విశ్వం మూవీతో అక్టోబర్ 11వ తేదీన థియేటర్లలో సందడి చేయనున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్.. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మరోవైపు, అదే రోజు నవదళపతి సుధీర్ బాబు.. మా నాన్న సూపర్‌ హీరో చిత్రంతో రానున్నారు. తండ్రీకొడుకుల అనుబంధంతో అభిలాష్‌ రెడ్డి కంకర సినిమాను తెరకెక్కించారు.

యంగ్ హీరో సుహాస్.. జనక అయితే గనకతో తెలుగు సినీ ప్రియులను తక్కువ గ్యాప్ లో మరోసారి పలకరించనున్నారు. బలమైన భావోద్వేగాలతో పాటు కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఆ మూవీ.. అక్టోబరు 12న రిలీజ్ కానుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వస్తున్న ఆ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే దసరా ప్రీసెలబ్రేషన్స్ లో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్-1.. సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

అక్కడికి వారం రోజులకు టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు స్వాగ్ మూవీ థియేటర్లో విడుదల కానుంది. రిస్క్ ఉన్నట్లు కనిపిస్తున్నా.. కంటెంట్ పై నమ్మకంతో మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మొత్తానికి ఈ దసరాకు టైర్-1 హీరోలెవరూ ఆడియన్స్ ను మెప్పించేందుకు రావడం లేదన్నమాట. దీంతో ఇది పెద్ద లోటు అని సినీ ప్రియులు ఉంటున్నారు. వారు కూడా ఉంటే ఫుల్ మజా అని చెబుతున్నారు. మరి తప్పదు కదా! అడ్జెస్ట్ అయిపోవడమే!!