దేవరలో దసరా విలన్.. ఎందుకిలా చేశారు?
సినిమాలో విలన్ గా కనిపించి ఆడియన్స్ ను మెప్పించారు.
By: Tupaki Desk | 28 Sep 2024 8:43 AM GMTఅన్నయ్యుం రసూలం, ఇష్క్, లవ్, జిగర్తండా డబుల్ ఎక్స్, భీష్మ పర్వం వంటి పలు సినిమాలతో మాలీవుడ్ లో యాక్టర్ షైన్ టామ్ చాకో ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో తెలిసిందే. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. సినిమాలో విలన్ గా కనిపించి ఆడియన్స్ ను మెప్పించారు. డెబ్యూ మూవీతోనే మంచి హిట్ అందుకున్నారు.
ఆ తర్వాత యంగ్ హీరో నాగశౌర్య రంగబలి మూవీలో విలన్ గానే కనిపించారు షైన్ టామ్ చాకో. కానీ కంటెంట్ క్లిక్ అవ్వకపోవడంతో మూవీ డిజాస్టర్ గా మారింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర పార్ట్-1లో నటించారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన మూవీ.. సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా విడుదలైంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.170 కోట్లకు పైగా వసూలు చేసిన ఆ సినిమాలో ఓ రోల్ లో కనిపించారు చాకో.
కానీ షైన్ చాకోను మేకర్స్ సరైన రీతిలో వాడుకోలేదని సోషల్ మీడియాలో ఇప్పుడు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. స్కోప్ లేని పాత్ర కావడంతో కొన్ని సీన్లలో మాత్రమే ఆయన కనిపించారని చెబుతున్నారు. ముఖ్యంగా విలన్ భైర రోల్ చేసిన సైఫ్ అలీఖాన్ గ్యాంగ్ ను చాలా పెద్దగా మేకర్స్ డిజైన్ చేశారని, కాబట్టి ఆ గ్యాంగ్ లో చాకో కలిసిపోయారని అంటున్నారు. స్పెషల్ గా ఆయన రోల్ ఇంపాక్ట్ కనిపించలేదని అభిప్రాయపడుతున్నారు.
అయితే సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ లో హీరో చేతిలో కత్తిపోటుకు గురైన టిమ్ చాకో.. ఆ తర్వాత మళ్లీ ఓసారి కనిపిస్తారు. దీంతో ఆయన పాత్రకు దేవర సీక్వెల్ లో ప్రాధాన్యమున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వ్యక్తి ఎలా బతికాడనే డౌట్ ను మేకర్స్.. సెకండ్ పార్ట్ లో క్లియర్ చేయనున్నట్లు అర్థమవుతుంది. కానీ దేవర పార్ట్-2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కాస్త టైమ్ పట్టేట్లు కనిపిస్తుంది.
ఇక.. టిమ్ చాకో చేతిలో దేవర సీక్వెల్ కాకుండా మరో తెలుగు ప్రాజెక్ట్ లేదు. అవకాశాలు వచ్చాయో లేదో తెలియదు కానీ.. ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు. ఏదేమైనా.. టిమ్ చాకో వంటి విలక్షణమైన నటులకు మంచి స్కోప్ ఉన్న రోల్స్ ఇవ్వాలని సినీ ప్రియులు కోరుతున్నారు. యాక్టింగ్ మీద మంచి పట్టున్న క్యారెక్టర్ ఆర్టిస్టులను మాలీవుడ్ నుంచి తీసుకురావడమే కాదు.. ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.