దసరా టికెట్ రేట్లు.. లియోకి అంత డిమాండా?
ఈ మూడు చిత్రాల కోసం అటు అభిమానులు ఇటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వీటి టికెట్ ధరల వివరాలు బయటకు వచ్చాయి.
By: Tupaki Desk | 13 Oct 2023 7:43 AM GMTతెలుగు సినీ పరిశ్రమలో పండగ సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల జోరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దసరా పండగ రాబోతుంది. ఈ పండగ బరిలో ఏకంగా ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుండగా... తెలుగు బాక్సాఫీస్ ముందు మూడింటి మధ్య గట్టి పోటీ నెలకొంది. అవే బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, దళపతి విజయ్ లియో.
ఈ మూడు చిత్రాల కోసం అటు అభిమానులు ఇటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వీటి టికెట్ ధరల వివరాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్ నగరంలోని మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ చిత్రాల టికెట్లను ఎంతకు విక్రయిస్తున్నారో తెలిసింది. అయితే ఇక్కడ డబ్బింగ్ సినిమా అయిన లియోకు భారీగా రేట్లు ఉండటం గమనార్హం.
అవును మీరు చదివింది నిజమే. భగవంత్ కేసరికి మల్టీప్లెక్స్‌లో రూ. 250, సింగిల్ స్క్రీన్‌లో రూ.175 ఉండగా.. టైగర్ నాగేశ్వరరావుకు మల్టీప్లెక్స్‌లో రూ.200, సింగిల్ స్క్రీన్‌లో రూ.150గా ఉందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ లియో మాత్రం ఏకంగా మల్టీప్లెక్స్‌లో రూ. 295, సింగిల్ స్క్రీన్‌లో రూ.175గా చూపించడం ఆసక్తికరంగా ఉంది. ఓ డబ్బింగ్ చిత్రంకు సొంత భాషల చిత్రాల కన్నా ఎక్కువగా విక్రయించడం అంటే ప్రస్తుతం దాని క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతోంది.
మరి ఈ టికెట్ ధరల్లో మార్పులు, చేర్పులు కూడా ఉండే అవకాశాలు చాలా వరకు ఉండొచ్చు. త్వరలోనే ఈ మూవీ టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఈ సినిమాల టికెట్ ధరలు ఏ రేంజ్లో ఉండబోతున్నాయి మరింత క్లారిటీ వస్తుంది. చూడాలి మరి ఈ సినిమాలు ఎంత వరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయో.. వీటిలో ఏది పై చేయి సాధిస్తుందో అనేది.
ఇకపోతే భగవంత్ కేసరి మాస్ ఎంటర్టైనర్ ఫాదర్ అండ్ డాటర్ నేపథ్యంలో రానుండగా.. టైగర్ నాగేశ్వరరావు ఓ గజదొంగ బయోపిక్‌గా వస్తోంది. లియో... గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కింది.