దాసరి బయోపిక్ ఎవరూ సాహసించడం లేదా?
దర్శకరత్న దాసరి నారాయణరావు మరణానంతరం ఆయన జీవిత కథని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగు తున్నట్లు అప్పట్లో మీడియా కథనాలు వెడెక్కించిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 4 Aug 2023 6:56 AM GMTదర్శకరత్న దాసరి నారాయణరావు మరణానంతరం ఆయన జీవిత కథని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగు తున్నట్లు అప్పట్లో మీడియా కథనాలు వెడెక్కించిన సంగతి తెలిసిందే. ఆయన శిష్యులు కథని సిద్దం చేస్తున్నారని...ఓ టాప్ డైరెక్టర్ ఆ బాధ్యతలు తీసుకున్నట్లు తెరపైకి వచ్చింది. దాసరి మరణానంతరం కొన్ని నెలలు పాటు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఆ కథనాలకు బ్రేక్ పడింది. ఇదంతా మీడియా ప్రచారం తప్ప! ఎవరూ ఎలాంటి సాహసం చేయడం లేదని దాసరి సన్నిహిత వర్గాల నుంచి లీకైంది.
అటుపై ఆ కుటుంబంలో కలతలు తలెత్తిన వైనం తెలిసిందే. దాసరి ఆస్తుల విషయంలో కుటుంబంలో తగాదాలు తలెత్తినట్లు వార్తలొచ్చాయి. అటుపై దాసరి బయోపిక్ సంగతంతా పూర్తిగా మర్చిపోయారు. మరి ఇంతకి దాసరి బయోపిక్ ఉన్నట్లా? లేనట్లా? అంటే ఇప్పటికీ డైలమానే కనిపిస్తోంది. దాసరి ప్రియ శిష్యులంతా వారి వారి వృత్తి గత జీవితాల్లో బిజీ అయినట్లు తెలుస్తోంది. దాసరికి ఇండస్ట్రీలో చాలా మంది శిష్యులున్నారు. అన్ని శాఖలపైనా దాసరికి మంచి పట్టు ఉంది. ఆ రకంగా అన్ని విభాగాల్లోనూ ఆయన శిష్యులు కనిపిస్తారు.
అయితే కథ సిద్దం చేసే బాధ్యతలు మాత్రం ఓ ప్రియు శిష్యుడు తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారంలోకి వచ్చింది. కానీ ఆ తర్వాత ఆయన కూడా ఈ అంశంపై ఎక్కడా స్పందించలేదు. మిగతా వారెవరు కూడా దాసరి కథపై ఆసక్తిగానూ కనిపించలేదు. ఆయన కథని రాయడానికి తమ అనుభవం సరిపోదని సాహసించడం లేదని కొంత మంది అంటున్నారు. సీనియర్ రచయితలు.. దర్శకు లంతా కమిట్ అయిన ప్రాజెక్ట్ లతోబిజీగా ఉండటంతో దాసరి కథపై ఫోకస్ చేయలేకపోతున్నారని వినిపిస్తుంది.
దాసరి పై ఇప్పటికే కొన్ని పుస్తకాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఆయన మరణానం తరం సీనియర్ జర్నలిస్టు లు ఆయన జీవిత చరిత్రని పుస్తకంలో పొందు పరిచారు. ఆయన తో సన్నిహితంగా ఉన్నవారే ఆయన కథని రాసారు. అయితే బయోగ్రఫీకి ఆ సమాచారం ఒక్కటే సరిపోదు. దాసరి సినిమా రంగంలో ఓ లెజెండ్. ఓ ఎన్ సైక్లో పీడియా. సినిమాల్లోకి ఆయన వచ్చిన విధానం..ఎదిగిన విధానం.. అటు పై పరిశ్రమ పెద్దగా ఆయన బాధ్యతలు ప్రతీది ఎంతో ఆసక్తికరం. ఆయన జీవితాన్ని రకరకాల కోణాల్లో విశ్లేషించాల్సి ఉంది. వాటన్నింటిని సినిమాగా మలచాలంటే త్రివిక్రమ్ లాంటి వాళ్లకే సాధ్యమ వుతుంది. కథగా రాయడం ఓ సవాల్ అయితే..దాన్ని తెరపైకి ఎక్కించడం అన్నది అంతకు మించిన పెను సవాల్.