Begin typing your search above and press return to search.

సెలబ్రిటీ స్టేటస్ కోసం డేటింగ్, లవ్ ఎఫైర్స్..?

ముఖ్యంగా ఫలానా హీరోయిన్ ఫలానా హీరోతో డేటింగ్ చేస్తుంది.. ఆ హీరో ఈ హీరోయిన్ లవ్ ఎఫైర్ అంటూ ముంబై మీడియా లో రెగ్యులర్ వార్తలు తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 March 2024 12:30 AM GMT
సెలబ్రిటీ స్టేటస్ కోసం డేటింగ్, లవ్ ఎఫైర్స్..?
X

బాలీవుడ్ హీరోయిన్స్ అంతా కూడా ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో ఉంటుంటారు. సినిమాలతో వారికి వచ్చే కవరేజ్ కన్నా సోషల్ మీడియా ద్వారానో.. లేక మిగతా విషయాల వల్లో ఎక్కువ న్యూస్ రన్ అవుతుంటాయి. వీటి వెనక చాలా పెద్ద స్కెచ్ ఉందని తెలుస్తుంది. బాలీవుడ్ లో రాణించాలంటే టాలెంట్ తో పాటు అక్కడ రెగ్యులర్ గా వార్తల్లో ఉండాలి. అలా ఉండాలంటే ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అందుకే ఫోటో షూట్స్, గాసిప్స్ తో అక్కడ భామలు బిజీ బిజీగా ఉంటారు.

ముఖ్యంగా ఫలానా హీరోయిన్ ఫలానా హీరోతో డేటింగ్ చేస్తుంది.. ఆ హీరో ఈ హీరోయిన్ లవ్ ఎఫైర్ అంటూ ముంబై మీడియా లో రెగ్యులర్ వార్తలు తెలిసిందే. అయితే వీటి వెనుక ఒక పెద్ద ప్లానే ఉందని టాక్. కేవలం సినిమాల వల్ల వచ్చే ఇమేజ్ ఛాన్సులు తెప్పిస్తుందని చెప్పడం కష్టం. ఒక్కో హీరోయిన్ కి ఒక్కో సినిమా హిట్టు పడుతుంది. వారి టాలెంట్ బయటకు వచ్చేలా చేస్తుంది. కానీ బాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే సినిమాలు హిట్టు కొట్టడం కాదు ఎంత వార్తల్లో ఉన్నామన్నది ఇంపార్టెంట్ అని తెలుస్తుంది.

సినిమాల్లో ఎంత హిట్ కొట్టినా సోషల్ మీడియా పాపులారిటీ లేకపోతే ఆ హీరోయిన్ ని బాలీవుడ్ మేకర్స్ పట్టించుకోరు. అదే ఫ్లాపులు ఉన్నా సరే సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంటే చాలు ఆ భామకు అవకాశాలు ఇచ్చేస్తారు. అందుకే అక్కడ భామలు కావాలని వారిపై డేటింగ్, లవ్ ఎఫైర్ వార్తల్లో ఉండేలా చూసుకుంటారు. అక్కడ నిజా నిజాలు ఏంటన్నది పక్కన పెడితే అలా వార్తల్లో ఉండటం వల్ల వారి గురించి ఆడియన్స్ లో డిస్కషన్ నడుస్తుంది. సో ఆ పాపులారిటీతో అవకాశాలు వస్తాయి.

బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో కొనసాగుతున్నా ఈమధ్య ఇది సౌత్ ఇండస్ట్రీకి పాకింది. ఇక్కడ భామలు కూడా తమ గురించి మీడియా ఎక్కువ కవరేజ్ చేసేలా ఫోటో షూట్స్ తో రెచ్చిపోతున్నారు. లవ్ స్టేటస్ మీద కన్ ఫ్యూజింగ్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల హీరోయిన్ నిజంగానే లవ్ లో ఉందేమో అని అనుకుంటారు. అలా సోషల్ మీడియా పాపులారిటీ ద్వారా అవకాశాలు అందుకుంటారు.