Begin typing your search above and press return to search.

నాకు తెలుగు రాద‌నుకుంటున్నారు.. పిచ్చోళ్లు

వార్న‌ర్‌కు సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో ఈ సినిమాలో న‌టిస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 March 2025 6:06 PM IST
Warner Nithin Sreeleela words
X

నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రాబిన్‌హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ కానున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ఆస్ట్రేలియ‌న్ స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ చిన్న క్యామియో చేస్తున్నారు. వార్న‌ర్ న‌టిస్తున్న మొద‌టి సినిమా ఇదే. వార్న‌ర్‌కు సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో ఈ సినిమాలో న‌టిస్తున్నారు.

అయితే వెంకీ కుడుముల వార్న‌ర్ తో కేవ‌లం సినిమాలో చిన్న క్యామియోనే చేయించాడ‌నుకుంటే ఆయ‌న్ని హైద‌రాబాద్‌కు తీసుకొచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టు గా పిలిచి ఆ ఈవెంట్ ను గ్రాండ్ స‌క్సెస్ చేశాడు. అక్క‌డితో అయిపోలేదు. వార్న‌ర్ తో రీల్స్ చేస్తూ చిత్ర యూనిట్ రాబిన్‌హుడ్ ను తెగ ప్ర‌మోట్ చేసేస్తుంది. వార్న‌ర్ తో తెలుగు డైలాగ్స్ చెప్పిస్తూ ఆడియ‌న్స్ ను అల‌రిస్తున్నారు.

ప్ర‌మోష‌న్స్ లో భాగంగా రీసెంట్ గా చిత్ర యూనిట్ షేర్ చేసిన ఓ రీల్ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. ఆ రీల్ లో నితిన్, శ్రీలీల వార్న‌ర్ కు తెలుగు నేర్పించాల‌ని ట్రై చేస్తారు. మేము మీకు తెలుగు నేర్పిస్తామ‌ని చెప్తూ, తెలుగు సినిమాలో నాకు నితిన్ అంటే పిచ్చి అని నితిన్ వార్న‌ర్ తో చెప్పించగా, నాకు శ్రీలీల తప్ప ఇంకెవ‌రూ న‌చ్చ‌రని శ్రీలీల స‌ద‌రు స్టార్ క్రికెటర్ తో చెప్పిస్తుంది.

నితిన్, శ్రీలీల త‌న‌కు చెప్పిన మాట‌ల్ని చెప్పిన‌ట్టే ప‌లికిన వార్న‌ర్, త‌ర్వాత వాళ్లు వెళ్లిపోయాక నాకు తెలుగు రాద‌నుకుంటున్నారు పిచ్చోళ్లు వీళ్లంతా అని అన‌డంతో ఆ రీల్ క్లోజ్ అవుతుంది. డేవిడ్ వార్న‌ర్ తో రాబిన్‌హుడ్ టీమ్ చేసిన ఈ ఫ‌న్నీ రీల్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అయితే ఈ వీడియోను చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు షూట్ చేసిన‌ట్టున్నారు. కానీ ఈ వీడియో ఇప్పుడు ప్ర‌మోష‌న్స్ కు భ‌లే ఉప‌యోగ‌ప‌డుతుంది.