Begin typing your search above and press return to search.

డేవిడ్ వార్నర్ ఇంకా పుష్ప 2 చూడలేదా?

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   7 Dec 2024 8:03 AM GMT
డేవిడ్ వార్నర్ ఇంకా పుష్ప 2 చూడలేదా?
X

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెటర్ గా ఎంత పాపులర్ అయ్యాడో సోషల్ మీడియా ద్వారా కూడా జనాలకి అదే తరహాలో కనెక్ట్ అయ్యాడు. టాలీవుడ్ సినిమాలపై నిత్యం ఏదో ఒక వీడియో చేస్తూ వైరల్ అవుతూ వచ్చాడు, ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల.. వైకుంటపురములో సాంగ్స్ కు స్టెప్పులు వేశాడు. అలాగే మార్ఫింగ్ వీడియోలతో హాల్ చల్ చేశాడు. బన్నీ నటించిన చిత్రాలపై అతనికున్న ప్రేమ అంతా ఇంతా కాదు.

పుష్ప రాజ్ పాత్రలో "తగ్గేదేలే" అంటూ చాలా సార్లు వీడియోలు చేసి, వాటిని సోషల్ మీడియాలో పంచుకున్న వార్నర్, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. బాహుబలి, సర్కారు వారి పాట వంటి సినిమాలను అనుకరిస్తూ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. రాజమౌళి తో కలిసి యాడ్ షూట్ చేసి కూడా అభిమానులను అలరించాడు. అయితే, లేటెస్ట్ గా విడుదలైన "పుష్ప 2: ది రూల్" గురించి వార్నర్ నుంచి ఏ అభిప్రాయం లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

"పుష్ప 2" సినిమా విడుదలై రెండు రోజులే కావస్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుష్ప రాజ్ అభిమానులు సినిమా గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, టాలీవుడ్ సినిమాలపై ప్రత్యేక ఆసక్తి చూపించే వార్నర్ నుంచి ఈ చిత్రంపై ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. పుష్ప 1 సమయంలో ఎక్కువగా "తగ్గేదేలే" డైలాగ్‌ను వీడియోల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న అతను, ఈ సారి మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నాడనే చర్చ జరుగుతోంది.

ఆస్ట్రేలియాలో కూడా "పుష్ప 2" భారీ అంచనాల మధ్య విడుదలైంది. తెలుగు ప్రేక్షకులే కాకుండా అక్కడి స్థానిక ప్రేక్షకులు కూడా పుష్ప చిత్రానికి మంచి ఆదరణ చూపిస్తున్నారు. కానీ డేవిడ్ వార్నర్ పుష్ప 2 ను ఇంకా చూడలేదా? లేదా చూసినా తన అభిప్రాయాలను పంచుకోకపోవడానికి ఏదైనా కారణం ఉందా? అనే ప్రశ్నలు అభిమానులను ఆలోచనలో పడేశాయి.

ఇదిలా ఉంటే, వార్నర్ గత కొంతకాలంగా తెలుగు ప్రేక్షకులతో సంబంధాలను కాస్త తగ్గించినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా అతను ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో ఉంటూ, తెలుగు అభిమానులతో మమేకం అయ్యాడు. కానీ SRH నుంచి విడిపోయిన అనంతరం, అతని తెలుగు హడావుడి కొంత తగ్గినట్టు అనిపిస్తోంది. పైగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో కూడా అతని పేరు పెద్దగా వినిపించకపోవడం, అభిమానులను నిరాశపరిచింది.

సాధారణంగా డేవిడ్ వార్నర్ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. బహుశా, ఆయన ప్రోగ్రామ్‌లతో బిజీగా ఉండడం వల్ల "పుష్ప 2" చూడలేకపోయి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఆయన గతంలో చేసిన వీడియోల వల్ల తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు ఏర్పడ్డ ప్రత్యేక స్థానం నేటికీ చెరిగిపోలేదు. మొత్తానికి, డేవిడ్ వార్నర్ పుష్ప 2 పై తన స్పందన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఆ రియాక్షన్ కూడా పుష్ప 2 మీద మరింత ప్రచారం కలిగించే అవకాశం ఉంది. ఇక "తగ్గేదేలే 2.0" వీడియో కోసం అయితే తెలుగు అభిమానులు ఎదురు చూస్తున్నారని అనిపిస్తోంది.