Begin typing your search above and press return to search.

రాబిన్‌హుడ్‌కు డేవిడ్ వార్న‌ర్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా?

ఆస్ట్రేలియ‌న్ క్రికెట్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్ కు సినిమాల‌న్నా, న‌ట‌న‌న్నా ఎంతో పిచ్చి. ఈ విష‌యం అంద‌రికీ తెలుసు.

By:  Tupaki Desk   |   6 March 2025 4:00 PM IST
రాబిన్‌హుడ్‌కు డేవిడ్ వార్న‌ర్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా?
X

ఆస్ట్రేలియ‌న్ క్రికెట్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్ కు సినిమాల‌న్నా, న‌ట‌న‌న్నా ఎంతో పిచ్చి. ఈ విష‌యం అంద‌రికీ తెలుసు. క‌రోనా టైమ్ లో ప‌లు వీడియోల‌కు టిక్ టాక్‌లు, రీల్స్ చేసి సౌత్ ఆడియ‌న్స్ కు ద‌గ్గ‌ర‌య్యాడు వార్న‌ర్. అల్లు అర్జున్, మ‌హేష్ బాబు, ప్ర‌భాస్ తో పాటూ ప‌లు టాలీవుడ్ హీరోల సినిమాల్లోని పాట‌ల‌కు స్టెప్పులేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు ఈ స్టార్ క్రికెట‌ర్.

వార్న‌ర్ కు ఉన్న యాక్టింగ్ ఇంట్రెస్ట్ ను రాబిన్‌హుడ్ టీమ్ క్యాష్ చేసుకుంటోంది. ఈ సినిమాలో ఓ కీల‌క‌పాత్ర కోసం డేవిడ్ వార్న‌ర్ ను రంగంలోకి దింపింది చిత్ర యూనిట్. నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రీసెంట్ గా ఓ సినీ వేడుక‌లో మైత్రీ నిర్మాత ర‌విశంక‌ర్ రాబిన్‌హుడ్ లో డేవిడ్ వార్న‌ర్ ఓ క్యామియో చేసిన విష‌యాన్ని వెల్ల‌డించాడు.

ముందు నుంచే ఈ విష‌యంపై వార్త‌లొచ్చాయి కానీ మేక‌ర్స్ మాత్రం దీని గురించి ఎక్క‌డా రివీల్ చేయ‌కుండా సీక్రెట్ గా ఉంచారు. ఇప్పుడు మేక‌ర్స్ కూడా వార్న‌ర్ డెబ్యూని క‌న్ఫ‌ర్మ్ చేయ‌డంతో ఇటు సినీ ల‌వ‌ర్స్ తో పాటూ అటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా రాబిన్‌హుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

అయితే వార్న‌ర్ ఈ మూవీలో న‌టించాడ‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ఈ మూవీ కోసం ఎంత ఛార్జ్ చేశాడ‌నేది తెలుసుకోవ‌డానికి అంద‌రూ ఎంతో ఆస‌క్తి చూపిస్తున్నారు. ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు నిర్మాత‌లు వార్న‌ర్‌కు రూ.50 ల‌క్షలు పారితోషికాన్ని ఇచ్చార‌ని తెలుస్తోంది.

పారితోషికం విష‌యంలో వార్న‌ర్ ఏం మాట్లాడ‌లేద‌ని, ఏదో స‌ర‌దాగా ఆ క్యారెక్ట‌ర్ ను చేస్తాన‌ని ఒప్పుకున్నాడ‌ని, కానీ వార్న‌ర్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని చిన్న పాత్ర అయిన‌ప్ప‌టికీ వార్న‌ర్ కు నిర్మాత‌లు రూ.50 ల‌క్ష‌లు ఇచ్చారంటున్నారు. మ‌రి దీని త‌ర్వాత కూడా డేవిడ్ వార్న‌ర్ సినిమాల్లో కంటిన్యూ అవుతాడో లేదో చూడాలి. రాబిన్‌హుడ్ మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.