Begin typing your search above and press return to search.

హాలీవుడ్ హీరోస్ కు ఏంటీ కటౌట్స్?

డెడ్‌ పూల్, వోల్వరిన్ కటౌట్స్ ముందు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన సందర్భంగా పెద్ద ఎత్తున డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు అభిమానులు.

By:  Tupaki Desk   |   15 July 2024 1:38 PM GMT
హాలీవుడ్ హీరోస్ కు ఏంటీ కటౌట్స్?
X

సినిమాల రిలీజులు, బర్త్ డేల సందర్భంగా టాలీవుడ్ హీరోలకు పెద్ద పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేయడం కామనే. వాటి ముందు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉంటారు. బ్యాండ్ బాజాల మధ్య డ్యాన్సులు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ సీన్.. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఎప్పటికప్పుడు కనిపిస్తుంటోంది. అయితే అదే టాలీవుడ్ హీరోల ప్లేస్ లో హాలీవుడ్ హీరోలు కటౌట్స్ ఉంటే.. వినడానికి కొత్తగా ఉన్నా.. అదే హైదరాబాద్ లో జరిగింది.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి త్వరలో మ‌రో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో డెడ్ పూల్ & వోల్వరిన్ మూవీ విడుదల అవ్వనుంది. మార్వెల్ చిత్రాలు.. రిలీజ్ కు రెడీ అయితే చాలు.. వరల్డ్ వైడ్ గా ఆ సినిమాల్లో ఉన్న సూపర్ హీరోల ఫ్యాన్స్ ఫుల్ సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అభిమానులు రచ్చ రచ్చ చేశారు. సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ లో భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు.

డెడ్‌ పూల్, వోల్వరిన్ కటౌట్స్ ముందు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన సందర్భంగా పెద్ద ఎత్తున డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు అభిమానులు. బాణసంచా కాల్చుతూ ఎంజాయ్ చేశారు. పేపర్లు ఎగరేస్తూ మూవీ రిలీజ్ కు స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ హీరోలకు ఇంత పెద్ద కటౌట్సా అంటూ నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. మార్వెల్ సినిమాలకు సూపర్ క్రేజ్ ఉందని చెబుతున్నారు.

షాన్ లెవీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ మూవీలో డెడ్‌ పూల్ గా ర్యాన్ రేనాల్డ్స్, వోల్వరిన్ గా హ్యూగ్ జాక్‌ మాన్ కనిపించనున్నారు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 26న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇండియాలో కూడా మార్వెల్ సినిమాలకు ఆదరణ ఉండడంతో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్.. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. దీంతో మూవీపై వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రియుల్లో అంచనాలు మరిన్ని పెరిగిపోతున్నాయి. డెడ్ పూల్ తో పాటు వోల్వ‌రిన్.. ఇద్ద‌రు సూప‌ర్ హీరోలు ఒకేసారి ఈ సినిమాతో అభిమానులు ముందుకు రానున్న నేప‌థ్యంలో అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.