Begin typing your search above and press return to search.

మళ్ళీ హీరోగా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. తెలుగులో కూడా..

ఈ సినిమా ఏపీ రిలీజ్ రైట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా తమిళ సినిమాలపై ఈ సంస్థ ఎక్కువగానే ఇన్వెస్ట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   29 March 2024 12:18 PM GMT
మళ్ళీ హీరోగా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. తెలుగులో కూడా..
X

ఐశ్వర్య రాజేష్, జీవీ ప్రకాష్ కుమార్ జోడీగా తమిళంలో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా మూవీ డియర్ ఏప్రిల్ 11న థియేటర్స్ లోకి రాబోతోంది. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే తమిళనాట స్టార్ట్ అయ్యాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు.

ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ కార్యక్రమాలు అవుతున్నాయని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి రీమేక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కథలు తెలుగులో క్లిక్ అవుతున్నాయి. రీసెంట్ గా మలయాళీ మూవీ ప్రేమలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో డియర్ మూవీని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతుంది.

ఈ సినిమా ఏపీ రిలీజ్ రైట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా తమిళ సినిమాలపై ఈ సంస్థ ఎక్కువగానే ఇన్వెస్ట్ చేస్తోంది. మంచి కంటెంట్ ఉంటేగాని తెలుగులో డబ్ చేయడం లేదు. అలాగే తెలంగాణ రైట్స్ ని ఏషియన్ మూవీస్ వారు సొంతం చేసుకున్నారు. ఈ రెండు కూడా బిగ్ డిస్టిబ్యూషన్ కంపెనీలు కావడంతో డియర్ మూవీ తెలుగులో కూడా భారీ స్క్రీన్స్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి మ్యూజిక్ కూడా అందిస్తూ ఉండటం విశేషం. ఇప్పటికే తమిళంలో డియర్ మూవీ నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. త్వరలో వాటిని తెలుగులో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందంటే. ఐశ్వర్య రాజేష్ కి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. దీంతో కచ్చితంగా డియర్ మూవీకి మంచి ఆదరణ వస్తుందని భావిస్తున్నారు.

ధనుష్ తెలుగులో నటించిన సర్ చిత్రానికి జీవీ మ్యూజిక్ అందించాడు. ఆ సినిమాలో సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. త్వరలో హీరో, హీరోయిన్ తెలుగులో కూడా మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారంట. డియర్ మూవీ తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది.

ఈ చిత్రాన్ని నట్ మెగ్ ప్రొడక్షన్స్ పై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. జగదీశ్ సుందరమూర్తి మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. కాళీ వెంకట్, రోహిణి, ఇళవరసు లాంటి యాక్టర్స్ మూవీలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఎంతో కాలంగా హీరోగా తన లక్కుని టెస్ట్ చేసుకుంటున్న జీవి ప్రకాష్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.