Begin typing your search above and press return to search.

పాట‌లో స్టార్ హీరో వ‌ర్సెస్ గ్యాంగ్ స్ట‌ర్.. పాట‌ల ర‌చ‌యిత‌కు హ‌త్యా బెదిరింపు!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మ‌ధ్య వార్ గురించి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Nov 2024 5:46 AM GMT
పాట‌లో స్టార్ హీరో వ‌ర్సెస్ గ్యాంగ్ స్ట‌ర్.. పాట‌ల ర‌చ‌యిత‌కు హ‌త్యా బెదిరింపు!
X

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మ‌ధ్య వార్ గురించి తెలిసిందే. కృష్ణ జింక‌ను వేటాడి చంపినందుకు బిష్ణోయ్ క‌మ్యూనిటీకి క్ష‌మాప‌ణ చెప్ప‌కపోతే స‌ల్మాన్ ని చంపేస్తామ‌ని గ్యాంగ్ స్ట‌ర్ బెదిరిస్తున్నాడు. కానీ స‌ల్మాన్ త‌గ్గేదేలే అంటూ పోలీస్ ప్రొటెక్ష‌న్ లో ఉన్నాడు. ఈ గొడ‌వ అంత‌కంత‌కు ముదురుతోంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఈగో స‌మ‌స్య‌కు ఇత‌రులు బ‌ల‌వుతున్నారు. ఇంత‌కుముందు స‌ల్మాన్ స్నేహితుడు, రాజ‌కీయ నాయ‌కుడు సిద్ధిఖ్ హ‌త్య‌కు గుర‌వ్వ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇప్పుడు స‌ల్మాన్ స‌న్నిహితుల‌కు ఎలాంటి ముప్పు ఉంటుందోన‌నే అందోళ‌న నెల‌కొంది. అత‌డి బంధుమిత్రుల్లో ఎవ‌రికి ఆప‌ద ఎదుర‌వుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఇటీవ‌ల స‌ల్మాన్ కి అత‌డి స‌హ‌చ‌రుల‌కు బ్యాక్ టు బ్యాక్ బెదిరింపులు ఎదుర‌వుతున్నాయి. ఇంత‌కుముందు 5 కోట్లు చెల్లించ‌క‌పోతే చంపేస్తామ‌ని గ్యాంగ్ స్ట‌ర్ అనుచ‌రుడు ఒక‌రు బెదిరించారు. నిన్న గాక మొన్న 50ల‌క్ష‌లు చెల్లించ‌క‌పోతే స‌ల్మాన్ స్నేహితుడైన షారూఖ్ ని చంపేస్తామ‌ని రాయ్ పూర్ నుంచి ఒక‌రు బెదిరించిన‌ట్టు పోలీసులు చెప్పారు. దీనిపై విచార‌ణ కొన‌సాగుతోంది. ఇంత‌లోనే ఇప్పుడు సల్మాన్ ఖాన్ - లారెన్స్ బిష్ణోయ్ ఇద్దరినీ లింక్ చేస్తూ విడుద‌ల చేసిన‌ పాటను ప్రస్తావిస్తూ, పాటల రచయిత ఎవ‌రైనా ఒక నెలలోపు తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటారని బెదిరించారు. ``సల్మాన్‌ఖాన్‌కు ధైర్యం ఉంటే వారిని రక్షించాలి`` అంటూ సల్మాన్‌ఖాన్‌కు నేరుగా సవాల్‌ విసిరే విధంగా సందేశం వెళ్లింది. స‌ల్మాన్ కి ఇటీవ‌లి కాలంలో వ‌రుస‌గా నాలుగో బెదిరింపు ఇది. గ్యాంగ్ స్ట‌ర్ అత‌డి అనుచ‌రులు సృష్టిస్తున్న‌ అరాచ‌కంగా పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా స‌ల్మాన్ స‌హ‌చ‌ర న‌టుడు షారుఖ్‌ఖాన్‌ను చంపేస్తానని బెదిరించి రూ. 50 లక్షలు డిమాండ్ చేయడంతో ముంబై పోలీసులు మరో కేసును విచారిస్తున్నారు. బాంద్రా పోలీసులకు చేసిన కాల్ రాయ్‌పూర్‌కు చెందిన న్యాయవాది ఫైజాన్ ఖాన్ ఫోన్ నుంచి వచ్చిన‌ట్టు గుర్తించారు. అతడు నవంబర్ 2 న తన ఫోన్ దొంగ‌త‌నానికి గురైంద‌ని, త‌న‌పై కుట్ర చేసినట్లు అనుమానిస్తున్నాన‌ని చెప్పాడు.