NCB అధికారి సమీర్ వాంఖడేకు హత్యా బెదిరింపు
ప్రముఖ వెబ్ పోర్టల్‌లోని ఓ కథనం ప్రకారం.. ప్రస్తుతం చెన్నైలో ఉద్యోగం కోసం నియమితుడైన వాంఖడేకు బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మతోన్మాది నుండి ఈ వారం ప్రారంభంలో ఫోన్‌లో బెదిరింపులు వచ్చాయి.
By: Tupaki Desk | 13 Oct 2023 10:39 AM GMTసెలబ్రిటీలకు ఇటీవల బెదిరింపులు రొటీన్ గా మారాయి. కండల హీరో సల్మాన్ ఖాన్ కు హత్యా బెదిరింపులు ఎదురైన అనంతరం కింగ్ ఖాన్ షారూఖ్ కి హత్యా బెదిరింపులు ఎదురవ్వడంతో ఆ ఇద్దరి విషయంలో ముంబై పోలీసులు సెక్యూరిటీని పెంచారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా నార్కోటిక్స్ బ్యూరో మాజీ ఛీఫ్ కి హత్యా బెదిరింపులు ఎదురవ్వడం చర్చకు వచ్చింది. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి, ఎన్‌సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు హత్య బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఆసక్తికరంగా వాంఖడేకు సెలబ్రిటీలతో ముడిపడిన అంశం ఇక్కడ పరిశీలించదగినది.
ప్రముఖ వెబ్ పోర్టల్‌లోని ఓ కథనం ప్రకారం.. ప్రస్తుతం చెన్నైలో ఉద్యోగం కోసం నియమితుడైన వాంఖడేకు బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మతోన్మాది నుండి ఈ వారం ప్రారంభంలో ఫోన్‌లో బెదిరింపులు వచ్చాయి. ముంబయి పోలీస్ కమిషనర్‌కు, అలాగే ముంబైలోని తన శాశ్వత నివాసానికి సమీపంలో ఉన్న స్థానిక పోలీసు స్టేషన్‌కు కూడా బెదిరింపు గురించి తెలియజేయడానికి వాంఖడే ఇమెయిల్ పంపాడని కథనాలొచ్చాయి.
ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం. సమీర్ వాంఖడే NCB ముంబై జోన్ కు లీడ్ గా ఉన్నప్పుడు హెడ్ లైన్స్ లో నిలిచాడు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన మాదకద్రవ్యాల స్వాధీనం కేసు సహా కొన్ని ఉన్నత స్థాయి కేసులను వాంఖడే ఎంతో గట్సీగా హ్యాండిల్ చేసారు.
SRK ఈ కేసులో అరెస్టయిన ఇతరుల కుటుంబాల నుండి 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసారంటూ CBI అతనిపై కేసు కూడా నమోదు చేసింది. ముఖ్యంగా ఆర్యన్ కస్టడీలో వరుస వైఫల్యాలను గుర్తించిన తర్వాత NCB అతనిపై కేసును ఉపసంహరించుకుంది. ఆర్యన్ ఖాన్ ఈ కేసు నుంచి నిరపరాధిగా బయటపడ్డాక వాంఖడేను తనదైన శైలిలో ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.
వాంఖడేకు అండగా వైఫ్:
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ పార్టీ కేసులో మాజీ ఎన్సీబీ అధికారి వాంఖడే ఖాన్ వారసుడు ఆర్యన్ ని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత ఆర్యన్ పై జరిగిన విచారణలో అతడి తప్పేమీ లేదని ప్రూవ్ అయింది. అంతేకాదు ఆర్యన్ అరెస్ట్ విషయంలో సమీర్ వాంఖడే అతి చేశాడని కూడా విమర్శలొచ్చాయి. సమీర్ వాంఖడేపై ఉన్నత స్థాయి దర్యాప్తు కూడా సాగుతోంది. ఆ సమయంలో మాజీ NCB జోనల్ హెడ్ సమీర్ వాంఖడే అతడి భార్య నటి క్రాంతి రెడ్కర్ మాట్లాడుతూ తనకు రిస్క్ ఉందని తెలిసి కూడా అతడు ఏదీ ఆలోచించకుండా ఆపరేషన్ నిర్వహిస్తాడని ... అలాంటి అధికారిపై ప్రజలు ఆరోపణలు చేసినప్పుడల్లా తాను నిరాశకు గురవుతున్నానని చెప్పారు.
ప్రమాదకర ముంబై డోంగ్రీలో ఆపరేషన్ కోసం సమీర్ లీడ్ తీసుకుని ముందుకు వెళ్లాడని చాలా కేసులను అతడు దిగ్విజయంగా లీడ్ చేసాడని కూడా ఆమె అన్నారు. చావు భయాన్ని కూడా లెక్క చేయడని తెలిపారు. అసమర్థులు సమీర్‌పై దోపిడీలకు పాల్పడినప్పుడల్లా నాకు కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది. సమీర్ రక్తంతో తడిసిన షర్టులు, చిరిగిన ప్యాంటు శుభ్రం చేశాను. నేను అతని బూట్లలోని మట్టిని శుభ్రం చేసాను. నేను ప్రతిదానికీ సాక్షిగా ఉన్నాను అని అన్నారు. ఒక సిన్సియర్ అధికారిపై ఇలా బురద జల్లడం ఆవేదన కలిగించిందని కూడా వ్యాఖ్యానించారు.