గోట్ లైఫ్ పై మళ్లీ చర్చ కారణం వాళ్లేనా?
ఈ సినిమా తో సుకుమార్-బ్లెస్సీ ప్రయాణం మూడు నెలుగు నెలలది కాదు దాదాపు 16 సంవత్సరాలు పాటు ఈ వాస్తవ కథని తెరకెక్కించారు.
By: Tupaki Desk | 1 Aug 2024 12:30 AM GMTఇటీవల రిలీజ్ అయిన మలయాళ చిత్రం 'ది గోట్ లైఫ్-ఆడు జీవితం' విమర్శకుల ప్రశంసలందుకున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన ప్రధాన పాత్రలో తెరకెక్కిన సర్వైవల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఓసరికొత్త అనుభూతిని పంచిన చిత్రంగా నిలిచింది. కుటుంబ పోషణ కోసం పొట్ట చేతపట్టుకుని కువైట్ వెళ్లిన అతడి జీవితం అక్కడ ఎలాంటి టర్నింగ్ తీసుకుంటుంది? గొర్రెల కాపరిగా గొర్రెల మధ్య అతడి జీవితం ఎలా సాగింది? తీవ్రమైన ఉష్ణోగ్రతల మధ్య ఎడారిలో అతడి ప్రయాణం ఎలా మొదలైంది? ఎలా ముగిసింది? అన్నది ఎంతో అద్భుంతంగా ఆవిష్కరించాడు దర్శకుడు బ్లెస్సీ.
ఈ సినిమా తో సుకుమార్-బ్లెస్సీ ప్రయాణం మూడు నెలుగు నెలలది కాదు దాదాపు 16 సంవత్సరాలు పాటు ఈ వాస్తవ కథని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సరిగ్గా ఇదే సమయంలో మరికొంత మంది గొర్రెలు, ఒంటెలు కాపర్ల జీవితాలు వెలుగులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల కు చెందిన కొందరు కువైట్ వెళ్లి మోసపోయిన నేపథ్యంలో..అక్కడ నుంచి ఎడారిలో వాళ్ల పడిన కష్టాలను వీడియో తీసి నెట్టింట రిలీజ్ చేయడం సంచలనంగా మారింది.
అవి వైరల్ అయి ప్రభుత్వాలు, సేవాసంస్థల దృష్టికి రావడంతో వాళ్లను తమ కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ఆడు జీవితంలో హీరో మాదినే కొంత మంది తెలుగు వారు అక్కడ ఎలా ఇబ్బంది పడుతున్నారు? అన్నది వీడియో తీయడంతో ఎన్నో వాస్తవాలు బయట పడ్డాయి. దీంతో ది గోట్ లైఫ్ సినిమమాని నెట్ ప్లిక్స్ లో ఆదరణ పెరిగింది. అసలు ఆ సినిమాలో ఏముందా అని చూసేవారి సంఖ్య పెరుగుతోంది.
ముఖ్యంగా బయటకొస్తున్న బాధితులంతా తెలుగు వారు కావడంతో ఈ సినిమాకి తెలుగు రిజీయన్ నుంచి ప్రత్యేకమైన ఆదరణ ఇప్పుడు దక్కడం విశేషం. థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి రివ్యూలు వచ్చాయి గానీ అంతగా ఆదరణకు నోచుకోలేదు. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఎగబడి చూస్తున్నారు.