టాప్-7 నటవారసుల తెరంగేట్రం!
యుగయుగాల నుండి నటవారసుల సినీఆరంగేట్రం చూస్తున్నదే. స్టార్‌కిడ్స్ కి సినిమా ఎల్లప్పుడూ మొదటి బలం. వెండితెర'పై వెలిగిపోవాలని దేశవ్యాప్తంగా వర్ధమాన తారల మిలియన్ డాలర్ కల.
By: Tupaki Desk | 3 Nov 2023 2:45 AM GMTయుగయుగాల నుండి నటవారసుల సినీఆరంగేట్రం చూస్తున్నదే. స్టార్‌కిడ్స్ కి సినిమా ఎల్లప్పుడూ మొదటి బలం. వెండితెర'పై వెలిగిపోవాలని దేశవ్యాప్తంగా వర్ధమాన తారల మిలియన్ డాలర్ కల. కానీ సినీపరిశ్రమల్లో విధి వెండి చెంచాతో పుట్టిన వారికి అనుకూలం. ఇప్పటికిప్పుడు బాలీవుడ్ లో ఏకంగా ఏడుగురు నటవారసులు వెండితెరకు పరిచయం అవుతుండడం వేడి పెంచుతోంది.
మూవీ ఇండస్ట్రీలో డెబ్యూ నటులుగా అడుగుపెడుతున్న స్టార్‌కిడ్స్ జాబితాను పరిశీలిస్తే తెలిసిన సంగతులివి.
1) సుహానా ఖాన్: సూపర్ స్టార్ కింగ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ జోయా అక్తర్ దర్శకత్వం వహించిన చిత్రం 'ది ఆర్చీస్తో' బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. సుహానా ఎప్పుడూ నటిగా మారేందుకు ప్రేరణ పొందింది. లండన్ ఆధారిత కళాశాలలో ఫిల్మ్ మేకింగ్ విద్యను కూడా అభ్యసించింది.
2) అగస్త్య నంద: బిగ్ బి (అమితాబ్ బచ్చన్) మనవడు అగస్త్య నంద కూడా తన 1వ నెట్‌ఫ్లిక్స్ విడుదల 'ది ఆర్చీస్' కోసం ఆసక్తిగా ఉన్నాడు. డిసెంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది.
3) ఖుషీ కపూర్: ఐకానిక్ స్టార్ శ్రీదేవి -ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె 'ఖుషీ కపూర్' కూడా ఇతర స్టార్‌కిడ్‌ల మాదిరిగానే 'ది ఆర్చీస్'లో మొదటిసారిగా నటిస్తున్నారు. సోదరి ద్వయం జాన్వీ-ఖుషి ఇద్దరినీ కలిపి త్వరలో తెరపై చూడాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
4) అలీజ్ అగ్నిహోత్రి: భాయిజాన్ సల్మాన్ ఖాన్ మేనకోడలు -అలిజే అగ్నిహోత్రి. ఈ నవంబర్ 24న విడుదల కానున్న జాతీయ అవార్డు-విజేత దర్శకుడు సౌమేంద్ర పాధి 'ఫారీ'లో తన ప్రతిభను ప్రదర్శిస్తుంది.
5) జునైద్ ఖాన్: మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కుమారుడు 'జునైద్ ఖాన్' యష్ రాజ్ ఫిల్మ్స్' ప్రామిసింగ్ ప్రాజెక్ట్- 'మహారాజా'లో నటించనున్నాడు. తన తొలి చిత్ర అరంగేట్రం పరిశ్రమలో అమీర్ కుటుంబం మనుగడగా అతడు భావిస్తున్నాడు.
6) షానాయ కపూర్: ఆల్ రౌండర్ కపూర్ క్లాన్ సభ్యుడు సంజయ్ కపూర్ కుమార్తె 'షనాయ కపూర్'. 2024లో విడుదల కానున్న సౌత్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వృషభ'లో కథానాయికగా నటించనుంది.
7) ఇబ్రహీం అలీ ఖాన్: సైఫ్ అలీఖాన్ పెద్ద కుమారుడు 'ఇబ్రహీం అలీఖాన్' మెగా బ్యానర్లు- ధర్మ ప్రొడక్షన్స్ , మడాక్ ఫిల్మ్స్ వేర్వేరుగా నిర్మించిన రెండు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. అతడు తనదైన లుక్స్ -స్టైల్ కోటియన్స్ కారణంగా బాలీవుడ్‌లోని అతి పిన్న వయస్కుడైనవాడిగా అందరికీ అభిమానం.