Begin typing your search above and press return to search.

డిసెంబర్ క్లాష్.. ఆ రెండు సినిమాలు జంప్!?

డిసెంబర్ మొదటి వారం నుంచి చివరి వరకు కూడా ఈసారి ఆసక్తికరమైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

By:  Tupaki Desk   |   13 Nov 2023 3:10 PM GMT
డిసెంబర్ క్లాష్.. ఆ రెండు సినిమాలు జంప్!?
X

బాక్స్ ఆఫీస్ వద్ద మళ్లీ డిసెంబర్లోనే అసలైన పోటీలు చూడబోతున్నాము అని అనుకుంటున్న తరుణంలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారం నుంచి చివరి వరకు కూడా ఈసారి ఆసక్తికరమైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని తెలుగు సినిమాలయితే డిసెంబర్ రెండోవారం నుంచి ఎక్కువగా సందడి చేయబోతున్నాయి.

సలార్ ఎలాగు ఉంది కాబట్టి అంతకంటే ముందుగానే రావడానికి వీడియం రేంజ్ హీరోలు ఆసక్తిని చూపించారు. ఇక అందులో నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో పాటు నాని హయ్ నాన్న, వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ వంటి సినిమాలు డిసెంబర్ రెండో వారం నుంచి సందడి చేయాలని అనుకున్నాయి.

పోటీలో విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ నాలుగు సినిమాలలో ఒక రెండు సినిమాలు మాత్రమే ఉండగా మరో రెండు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. హాయ్ నాన్న డిసెంబరు 7వ తేదీన రాబోతోంది. ఇక నితిన్ ఎక్స్ట్రా డిసెంబర్ 8వ తేదీన గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది.

ఈ రెండు సినిమాలకు సంబంధించిన పనులన్నీ కూడా దాదాపు పూర్తి అయ్యాయి. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఈ రిలీజ్ డేట్స్ లో అయితే ఎలాంటి డౌట్ లేదు. ఇక విశ్వక్ సేన్ వరుణ్ తేజ్ మాత్రం ఈ డిసెంబర్ క్లాష్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ తో మంచి అంచనాలను క్రియేట్ చేసుకుని ఊహించిన విధంగా ఇప్పుడు మళ్లీ ఈ పోటీలో నుంచి తప్పుకోవడంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక మరోవైపు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ పై పెద్దగా బజ్ అయితే క్రియేట్ కాలేదు. అసలు ఈ సినిమా వస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ప్రమోషన్స్ విషయంలో కాస్త జోరు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఊహించిన విధంగా వాయిదా నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ మరో కొత్త డేట్ ప్రకటించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.