2023 డిసెంబర్ సినిమాలు.. మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్
2023 ఏడాది మొత్తం తీసుకుంటే డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి.
By: Tupaki Desk | 17 Jan 2024 5:10 PM GMTగత ఏడాది డిసెంబర్ నెలలో సినిమా పరిశ్రమకి భారీగా బిజినెస్ జరిగింది. 2023 ఏడాది మొత్తం తీసుకుంటే డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. 2023 డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాయి? అందులో నెంబర్ వన్ ప్లేస్ ఏ సినిమాకి దక్కింది? అనే విషయాలను పరిశీలిస్తే..
డిసెంబర్ నెల మొత్తంలో రిలీజ్ అయిన అన్ని భాషల చిత్రాల్లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' కలెక్షన్స్ పరంగా టాప్ ప్లేస్ లో ఉంది. డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఫుల్ రన్ లో సుమారు 913 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. జస్ట్ 'A' రిలేటెడ్ సర్టిఫికెట్ తో యానిమల్ 913 కోట్ల కలెక్షన్స్ తో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.
ఆ తర్వాత పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'సలార్' రెండో స్థానంలో ఉంది. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 22న పాన్ స్థాయిలో రిలీజ్ అయింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 612 కోట్లు కొల్లగొట్టింది. సినిమాకి సరిగ్గా ప్రమోషన్స్ చేసి ఉంటే కచ్చితంగా 1000 కోట్ల మార్క్ అందుకునేది. ఇక సలార్ తర్వాత బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్ నటించిన 'డంకీ' 450 కోట్ల కలెక్షన్స్ తో మూడో స్థానంలో నిలిచింది.
బాలీవుడ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్ రాజ్ కుమార్ హిరాని తెరకెక్కించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద కచ్చితంగా 1000 కోట్లు కొల్లగొడుతుందని అంతా అనుకున్నారు. కానీ 'డంకీ' ఫుల్ రన్ లో కనీసం 500 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దీనికంటే ముందు షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు కొల్లగొట్టాయి.
విక్కీ కౌశల్ నటించిన 'సామ్ బహదూర్' వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 128 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన రీజినల్ ఫిల్మ్ 'నేరు' 85 కోట్ల గ్రాస్ అందుకుంది. డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ అయిన 'కాటేరా' కేవలం ఇండియా వైడ్ గా 77 కోట్ల వసూళ్ళు అందుకుంది. టాలీవుడ్ టైర్ 2హీరో నాచురల్ స్టార్ నాని నటించిన 'హాయ్ నాన్న' కూడా డిసెంబర్ నెలలోనే విడుదలై వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 77 కోట్లు కొల్లగొట్టింది.
యానిమల్ - 913 కోట్లు
సలార్ - 612 కోట్లు
డుంకీ ≈ 450 కోట్లు
సామ్ బహదూర్ - 128 కోట్లు
నెరు - 85 కోట్లు
కాటెరా - 77 కోట్లు
హాయ్ నాన్న - 77 కోట్లు