Begin typing your search above and press return to search.

బన్నీ మిరపకాయ్ ముద్దుగుమ్మ ఇప్పుడు ఇలా..!

అల్లు అర్జున్‌ నటించిన వేదం సినిమా ఆయన కెరీర్‌ లో చాలా స్పెషల్‌ మూవీ అనడంలో సందేహం లేదు

By:  Tupaki Desk   |   12 July 2024 11:30 AM GMT
బన్నీ మిరపకాయ్ ముద్దుగుమ్మ ఇప్పుడు ఇలా..!
X

అల్లు అర్జున్‌ నటించిన వేదం సినిమా ఆయన కెరీర్‌ లో చాలా స్పెషల్‌ మూవీ అనడంలో సందేహం లేదు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన వేదం సినిమాలో రిచ్‌ గర్ల్‌ గా దీక్షా సేత్‌ నటించిన విషయం తెల్సిందే. ఆమెను పడేసేందుకు అల్లు అర్జున్‌ చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

సినిమాలోని పాత్రకు తగ్గట్లుగా దీక్షా సేత్‌ నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విషయం తెల్సిందే. పాత్ర చిన్నదే అయినా కూడా ఆ సినిమాతో దీక్షా కి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. రవితేజ హీరోగా నటించిన మిరపకాయ్‌ సినిమాలో టైటిల్ కి సూట్‌ అయ్యే పాత్రను పోసించింది.

2012 లో చివరగా ఊ కొడతార.. ఉలిక్కి పడతారా సినిమాలో నటించి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. గత కొంత కాలంగా ఈ అమ్మడు లండన్ లో ఉంటుందని తెలుస్తోంది. సినిమాల్లో ఆశించిన స్థాయి విజయాలు రాకపోవడంతో పాటు, ఎన్ని సినిమాలు చేసినా కూడా స్టార్ డమ్‌ దక్కలేదు. దాంతో ఇండస్ట్రీకి దూరం అయ్యిందని తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో దీక్షా మళ్లీ సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. తన రొటీన్ డైలీ లైఫ్‌ కి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టా లో షేర్ చేస్తోంది. గతంలో కంటే ఇప్పుడు సన్నగా నాజూకుగా అందంగా కనిపిస్తుందని ఈ ఫోటోలకు నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ తో రెబల్‌ వంటి భారీ చిత్రాల్లో నటించిన దీక్షా సేత్‌ మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే కచ్చితంగా మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆమెకు ఆ ఆసక్తి ఉందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సోషల్‌ మీడియాలో ఫోటోలను షేర్‌ చేస్తున్న దీక్షా రీ ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు.