భార్యాభర్తల మధ్యలో మాజీ ప్రేయసి!
రణబీర్ కపూర్-అలియా భట్ మధ్యలోకి దీపిక ఎంటర్ అయితే ఎలా ఉంటుందన్నది? ఆసక్తికరంగా భన్సాలీ మలచబోతున్నాడుట.
By: Tupaki Desk | 27 Dec 2024 11:30 AM GMTరణబీర్ కపూర్-అలియాభట్ జంటగా సంజయ్ లీలీ భన్సాలీ 'లవ్ అండ్ వార్' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. భార్యాభర్తలిద్దరు వెండి తెరపై మరోసారి ప్రేమికులుగా కనిపించబోతున్నారు. భన్సాలీ మేకింగ్ లో ప్రేమికులు ఎంత అందంగా రొమాంటిక్ గా కనిపిస్తారో చెప్పాల్సిన పనిలేదు. మరోసారి ప్రేమ పక్షల్లా ప్రేక్షకుల్ని అలరించనున్నారు. అయితే ఇప్పుడా అందమైన జంట మధ్యలోకి మాజీ ప్రేయసి దిగుతుంది. దీపికా పదుకొణే సినిమాలో ఓ కీలక పాత్రకు ఎంపిక చేసారు.
దీంతో ఇప్పుడీ ప్రాజెక్ట్ మరింత రసవత్తరంగా మారింది. రణబీర్ కపూర్-అలియా భట్ మధ్యలోకి దీపిక ఎంటర్ అయితే ఎలా ఉంటుందన్నది? ఆసక్తికరంగా భన్సాలీ మలచబోతున్నాడుట. వాళ్ల వాస్తవ జీవితాలకు దగ్గరగా ఈ కథ ఉంటుందనే ప్రచారం తొలి నుంచి జరుగుతోంది. తాజాగా దీపిక ఎంట్రీ ఇదంతా నిజమయ్యేలా ఉంది. అలియాభట్ తో ప్రేమ పెళ్లి కంటే ముందు రణబీర్ కపూర్-దీపికా పదుకొణే ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో? ప్రపంచానికి తెలిసిందే.
వివాహ బంధంతో ఒక్కటవ్వాల నుకున్నారు. కానీ అనూహ్యంగా మనస్పర్దల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత కొంత కాలానికి దీపిక పదుకొణే? రణవీర్ సింగ్ తో ప్రేమలో పడి అతడితో జీవితాన్ని పంచుకుంది. అలాగని దీపిక-రణబీర్ కపూర్ మధ్య స్నేహం మాత్రం చెడలేదు. స్నేహితులుగా అప్పుడప్పుడు కలుస్తుంటారు. అయితే విడిపోయిన తర్వాత మాత్రం మళ్లీ కలిసి సినిమా చేయలేదు. ఆరకంగా మళ్లీ సంజయ్ లీలా భన్సాలీ తన సినిమా ద్వారా కలుపుతున్నారు. మరి తెరపై ఆ కాంబినేషన్ లో ఎలాంటి సన్నివేశాలుంటాయో చూడాలి.
ఇప్పటికే దీపికా పదుకొణే భన్సాలీ దర్శకత్వంలో కొన్ని సినిమాలు చేసింది. 'రామ్ లీలా', 'పద్మావత్', ' బాజీరావ్ మస్తానీ' లాంటి బ్లాక్ బస్టర్లు ఆ కాంబినేషన్ లో ఉన్నాయి. అప్పటి నుంచి భన్సాలీతో దీపికకు మంచి ర్యాప్ ఉంది. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్యలోకి మాజీని తీసుకొస్తున్నారు. మరి ఈ మాజీ భార్యా భర్తల మధ్య తగాదా లేవనెత్తకుండా ఉండే చాలు.