Begin typing your search above and press return to search.

కల్కి అమ్మ.. దీపిక నిజంగా తల్లి అయ్యేది అప్పుడే..

కల్కి మూవీ షూటింగ్ అనంతరం దీపిక ఇప్పుడు తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది.

By:  Tupaki Desk   |   1 Sep 2024 9:04 AM GMT
కల్కి అమ్మ.. దీపిక నిజంగా తల్లి అయ్యేది అప్పుడే..
X

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కల్కి చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే తెలుగులో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న దీపిక ప్రస్తుతం తల్లితనంలోని కమ్మదనాన్ని అనుభవించడానికి సిద్ధమవుతోంది. కల్కి మూవీ షూటింగ్ అనంతరం దీపిక ఇప్పుడు తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది.

2018లో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో దీపిక పెళ్లి జరిగింది. అనంతరం 20204 ఫిబ్రవరిలో ఈ జంట ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తమ గర్భం గురించిన సమాచారాన్ని అభిమానులతో పంచుకున్నారు. బాలీవుడ్ లో దీపిక సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. నటిగా ఆమెకు చాలా గుర్తింపు కూడా ఉంది. ఈ వార్త తెలిసిన తర్వాత అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ఆమెకు అభినందనలు తెలియజేశారు.

బిడ్డ పుట్టక ముందే ఈ జంట కొత్త ఇంటిది కూడా సిద్ధం చేశారు. దీపిక బిడ్డతో కలిసి కొత్త ఇంటికి మారుతారట.

అయితే మరో పక్క సోషల్ మీడియాలో దీపిక ప్రెగ్నెన్సీ పై పలు రకాల వివాదాలు ప్రచారం అయ్యాయి. మొదట కొంతమంది ఆమె నిజంగా తల్లి కాలేదని.. ఇది ఒక ఫేక్ ప్రెగ్నెన్సీ అని ప్రచారం చేశారు. దీనికి దీపిక అభిమానులు స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు.. కల్కి సక్సెస్ మీట్ లో తన బేబీ బంప్ తో కనిపించిన దీపిక అందరిని ఆకట్టుకోవడంతోపాటు తనపై వస్తున్న విమర్శలకు పుల్ స్టాప్ పెట్టారు.

ప్రస్తుతం దీపిక డెలివరీ సమయం దగ్గర పడడంతో షూటింగులకు దూరంగా ఉంటున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా కొంతకాలం విరామం తీసుకుని తన ప్రెగ్నెన్సీ టైం ని పూర్తిగా ఎంజాయ్ చేయడానికి దీపిక ఫిక్సయింది. అందుకే ఆమె కొన్ని నెలల పాటు బిడ్డకు పూర్తి సమయాన్ని కేటాయిచ్చి వచ్చే ఏడాది మార్చ్ వరకు తన ప్రసూతి సెలవులను ఎంజాయ్ చేస్తుందట. వచ్చే ఏడాది మార్చ్ వరకు దీపిక షూటింగ్స్ లో పాల్గొనదు అని తెలుస్తోంది.

రీసెంట్ గా దీపిక తన బిడ్డను లండన్ లో ప్రసవించే అవకాశం ఉంది అని మరొక కథనం వైరల్ అయింది. అయితే ఇది అవాస్తవమని.. కేవలం ఊహాగానమని టాక్.

దీపిక ముంబైలోని ఓ హాస్పిటల్ లో తన బిడ్డకు జన్మనివ్వబోతోందని తెలుస్తోంది. సెప్టెంబర్ 28వ తారీఖున ఆమె డెలివరీ జరిగే అవకాశం ఉంది. దీపిక, రణవీర్ ఇద్దరూ రాబోయే తమ చిట్టి అతిధి కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.