Begin typing your search above and press return to search.

నన్ను ఆ విషయంలో కామెంట్ చేశారు.. అసలు విషయం బయట పెట్టిన దీపికా పదుకొణె..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. కల్కి మూవీ కారణంగా టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   10 Oct 2024 11:30 PM GMT
నన్ను ఆ విషయంలో కామెంట్ చేశారు.. అసలు విషయం బయట పెట్టిన దీపికా పదుకొణె..
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. కల్కి మూవీ కారణంగా టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అందంతో పాటు అద్భుతమైన అభినయం కూడా కలిగిన దీపిక.. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సాధారణంగా మనం హీరోని చూసి సినిమాకి వెళ్తాము అయితే ఆ పద్ధతులను మారుస్తూ హీరోయిన్ ఓరియంటెడ్ గా కూడా సినిమాలను చూడొచ్చు అని నిరూపిస్తోంది దీపికా.

ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయి మాట తీరుని విమర్శించారు అంటే మీరు నమ్ముతారా. అవునండి ఇది నిజం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తాజాగా మాతృత్వంలోని మమకారాన్ని అనుభవిస్తూ కాస్త కెరీర్ కు గ్యాప్ తీసుకున్న దీపిక పండు అంటే బిడ్డకు జన్మనిచ్చింది. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఆమె షూటింగుల్లో పాల్గొంటూ రెండు సినిమాలను పూర్తి చేసింది. అంతేకాదు ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కల్కి ప్రమోషన్స్ లో కూడా చురుకుగా పాల్గొని విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

ప్రజెంట్ పాపతో టైం స్పెండ్ చేస్తూ కెరీర్ కు కాస్త గ్యాప్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి ప్రస్తావించింది. షారుక్ ఖాన్ జంటగా దీపిక ఓం శాంతి ఓం చిత్రంలో నటించింది. ఇది ఆమె మొదటి చిత్రం కావడంతో ఆమె యాక్షన్ పై ఎన్నో నెగటివ్ రివ్యూలు వచ్చాయి.

అయితే సాధారణంగా అటువంటి వాటిని పట్టించుకోని దీపిక ఒక్క కామెంట్ కి మాత్రం చాలా బాధపడినట్లు వెల్లడించింది. తను మాట్లాడే తీరుని.. ఆమె యాక్టింగ్ ని విమర్శిస్తూ.. చాలా తక్కువగా మాట్లాడుతూ రాసిన ఆ కామెంట్ ఆమెను ఎంతో బాధ పెట్టింది. అయితే తనను తాను పూర్తిస్థాయిలో ప్రూవ్ చేసుకోవడానికి ఆ కామెంట్ ఆమెకు సహాయపడింది అని కూడా దీపిక వెల్లడించింది.

ఆ సంగతిని మరొకసారి గుర్తు చేసుకున్న దీపిక నిజంగా నెగటివ్ రివ్యూలు కూడా ఒక్కొక్కసారి మనల్ని ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తాయి.. అయితే వాటిని మనం తీసుకునే విధానంపై అది ఆధారపడి ఉంటుంది అని వెల్లడించింది.