గర్భిణి దీపిక ఫోటోషూట్.. కల్కి ఆవిర్భావానికి డేట్ ఫిక్స్
ఇటీవలే కల్కి 2989 ఏడి చిత్రంలో నటించింది దీపిక పదుకొనే. కెరీర్ లో తొలి బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ అందుకుంది.
By: Tupaki Desk | 2 Sep 2024 4:40 PM GMTఇటీవలే కల్కి 2989 ఏడి చిత్రంలో నటించింది దీపిక పదుకొనే. కెరీర్ లో తొలి బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ అందుకుంది. కల్కి ప్రమోషన్స్ లో బేబి బంప్ తో కనిపించింది. ఇంతలోనే ఇప్పుడు బిడ్డను కనేందుకు కూడా సిద్ధమైంది. అయితే దీపిక బేబి బంప్ నిజమా కాదా? అంటూ నెటిజనులు కొందరు సందేహించిన క్షణం.. నెలల తరబడి కొందరి వెటకారం అవమానాలు చవి చూసింది ఈ మేటి నటి. కొందరు బేబీ బంప్ నిజమే అన్నారు. మరికొందరు దాని ఆకారం మారుతూనే ఉందని వ్యంగ్యంగా మాట్లాడారు. ఘాటు మోటు వ్యాఖ్యలు సోషల్ మీడియాల్లో ఎన్నో. ఇవన్నీ రకరకాల పుకార్లకు ఆజ్యం పోశాయి. అయితే దీపిక అన్నిటికీ ఇలా సమాధానమిచ్చింది. తన భర్త రణవీర్ సింగ్‌తో కలసి తన బేబీ బంప్ ఫోటోషూట్ ని షేర్ చేయడం ద్వారా అన్నిటికీ చెక్ పెట్టింది.
నిండు గర్భిణి అయిన దీపికా పదుకొణె ప్రసూతి ఫోటోషూట్ తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఇది అద్భుతమైన వేడుక. ఒక చక్కని ఫోటోలో దీపిక నలుపు రంగు సూట్ - లేస్ బ్రాలెట్ కాంబోను ధరించి కనిపించింది. తన బేబి బంప్ ని ఈ ఫోటోషూట్ విస్తారంగా ప్రదర్శించింది. తనదైన మార్క్ చిరునవ్వుతో దీపిక వెలుగులు నింపింది. ఇక బేబి బంప్ ని ఆవిష్కరించే అందమైన నల్లటి పారదర్శక దుస్తులలో దీపిక ఫోజులు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ స్పెషల్ ఫోటోషూట్ బేబి బంప్‌ని అందంగా చూపించింది.
చాలా ఊహాగానాల తర్వాత దీపికా - రణవీర్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి బిడ్డ గురించి ప్రకటించారు. తమ బిడ్డ సెప్టెంబర్ 2024లో జన్మిస్తుందని తెలిపారు. ఈ పోస్ట్‌కు ఆలియా భట్, ప్రియాంక చోప్రా జోనాస్, విక్రాంత్ మాస్సే, ఆయుష్మాన్ ఖురానా, సోనమ్ కపూర్ అహూజా వంటి సహచరుల నుండి చాలా ప్రేమ లభించింది. ప్రస్తుతం దీపిక-రణవీర్ జంట బిడ్డ ఆగమనం కోసం మంచి చోటు (ఆస్పత్రి) వెతుకుతున్నారు. ప్రణాళిక ప్రకారం అన్నీ జరిగితే.. సెప్టెంబర్ 28న సౌత్ బాంబేలోని ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిస్తుంది. ప్రస్తుతం కాబోయే తల్లి దీపిక తన పని నుండి విరామం తీసుకుని ప్రతిదీ ఆస్వాధిస్తోంది. ఎట్టకేలకు లండన్‌లో ప్రసవం వార్తలకు కూడా చెక్ పడిపోయింది. గర్భిణి దీపిక ఫోటోషూట్ ని వీక్షించాక.. కల్కి ఆవిర్భావానికి డేట్ ఫిక్స్ అయిందంటూ అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. కల్కి చిత్రంలోను యాధృచ్ఛికంగా దీపిక పాత్ర గర్భాన్ని మోస్తుంది.