Begin typing your search above and press return to search.

దీపికా పదుకొనే టచ్ చేయలేకపోతున్నారా..?

కల్కి కోసమే దాదాపు అమ్మడు 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుందని టాక్. నెక్స్ట్ సినిమాకు 15 కోట్లు ఐతేనే చేస్తానని అంటుందట.

By:  Tupaki Desk   |   30 Nov 2024 8:30 AM GMT
దీపికా పదుకొనే టచ్ చేయలేకపోతున్నారా..?
X

బాలీవుడ్ అనాల భామ దీపిక పదుకొనె ఈ ఇయర్ ఫైట్ తో పాటు కల్కి 2898 AD, సింగం ఎగైన్ సినిమాల్లో నటించింది. కల్కి సినిమాలో సుమతి పాత్రలో దీపిక నటన సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యింది. దీపిక ప్రగ్నన్సీ వల్ల తన సినిమాలు బాగా తగ్గిపోయాయని చెప్పొచ్చు అయినా కూడా అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కల్కి తో సౌత్ ఆడియన్స్ ను అలరించిన అమ్మడు మరోసారి అలాంటి ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.

సౌత్ లో ముఖ్యంగా తెలుగులో దీపిక అవకాశాలను అందుకోవాలని చూస్తుంది. కానీ దీపిక కు నచ్చే కథలు మాత్రం రావట్లేదట. కల్కి లో తన పాత్ర వెయిట్ ఉంది కాబట్టి ఒప్పేసుకున్న అమ్మడు మళ్లీ తెలుగు సినిమా చేయాలంటే అలాంటి కథలే కావాలని అంటుందట. ఈమధ్య ఒక తెలుగు మేకర్ దీపికని వారి సినిమాలో తీసుకోవాలని అడిగితే కథ సంగతి ఏమో కానీ భారీ రెమ్యునరేషన్ అడిగి షాక్ ఇచ్చిందట.

కల్కి కోసమే దాదాపు అమ్మడు 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుందని టాక్. నెక్స్ట్ సినిమాకు 15 కోట్లు ఐతేనే చేస్తానని అంటుందట. ఐతే చేసేది పాన్ ఇండియా సినిమానే బడ్జెట్ కూడా 300 కోట్ల పై మాటే అయినా కూడా ఆమెకు 15, 20 కోట్లు ఇవ్వడం కష్టమని భావిస్తున్నారట. దీపిక క్రేజ్ సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడం వల్ల సినిమాకు చాలా హెల్ప్ అవుతుంది.

అంతేకాదు ఛాలెంజింగ్ పాత్ర అయితే దీపిక నటన సినిమా మీద భారీ ఇంపాక్ట్ చూపిస్తుంది. కెరీర్ మొదటి నుంచి అటు గ్లామర్ తో పాటు ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్న దీపికా ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ తన గ్రాఫ్ పడిపోకుండా చూసుకుంటూ వస్తుంది.

రణ్ వీర్ తో పెళ్లి తర్వాత సినిమాల విషయంలో దూకుడు తగ్గుతుంది అనుకుంటే అది డబుల్ అయ్యేలా అమ్మడు రెచ్చిపోతుంది. ప్రస్తుతం చేతిలో సినిమాలేవి లేకపోయినా దీపిక మాత్రం తనకు నచ్చిన కథ అడిగిన రెమ్యునరేషన్ ఇస్తేనే సినిమా చేస్తానని గట్టిగా చెబుతుందని తెలుస్తుంది. ఎలాగు కల్కి 2 లో దీపిక ఉండే అవకాశం ఉంది. మరో తెలుగు సినిమాలో ఆమెను చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నా కూడా అమ్మడి రెమ్యునరేషన్ డిమాండ్ చూసి అందరు వెనక్కి తగ్గుతున్నారు.