బికినీ స్కీన్ షోకి దీపిక పదుకొణే బ్రాండ్ లా!
తొలిసారి 'పఠాన్' లో ధరించిన బికినీ ఎంతటి దుమారం రేపిందో తెలిసిందే. ఏకంగా రెండు రాజకీయ పార్టీల మధ్య నే దీపిక కాషాయ రంగు బికినీ చిచ్చు పెట్టింది.
By: Tupaki Desk | 20 Jan 2024 5:58 AM GMTబాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణేకి సినిమాల్లో బికినీ ధరించడం కొత్తేం కాదు. ఆమె ఏ సినిమా చేసినా సన్నివేశం బికినీ డిమాండ్ చేసిందంటే? పూర్తిగా దర్శకుల హీరోయిన్ గా మారిపోతుంది. దర్శకుడి తనని ఎలా చూపించాలనుకుంటున్నాడో? అంతకు మించి ఎక్కువగానే హైలైట్ అవుతుంది తప్ప తగ్గడానికి ఛాన్స్ తీసుకొదు. పఠాన్ వరకూ బికినీ సన్నివేశాలు ఏ రోజు ఆమెకి ఇబ్బంది కలిగించలేదు.
తొలిసారి 'పఠాన్' లో ధరించిన బికినీ ఎంతటి దుమారం రేపిందో తెలిసిందే. ఏకంగా రెండు రాజకీయ పార్టీల మధ్య నే దీపిక కాషాయ రంగు బికినీ చిచ్చు పెట్టింది. వ్యక్తిగతంగానూ అమ్మడు ఓ పార్టీకి టార్గెట్ అయింది. కొందరి మనోభావాలు దెబ్బ తీసినట్లు గానూ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ రకమైన విమర్శలు దీపిక కెరీర్ లో అవే తొలిసారి. ఎప్పుడూ ఎలాంటి వివాదం లేకుండా వెళ్లిపోయే దీపికకి అది బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ గా మిగిలిపోయింది.
సాధారణంగా ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు తదుపరి మళ్లీ అలాంటి సన్నివేశాల్లో నటించా లన్నా? బికినీ ధరించాలన్నా కాస్త ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కానీ దీపిక మాత్రం డోంట్ కేర్ అంటూనే దూసుకుపోతుంది. అమ్మడు ప్రస్తుతం హృతిక్ సరసన పైటర్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ హాట్ బికినీ ధరించింది. ఆ పాట లో దాదాపు బికినీలోనే ఎక్కువగా హైలైట్ అయింది. మును పెన్నడు కనిపించనంత హాట్ గానూ ఆ బికినీలో రచ్చ చేసింది.
ఇప్పటికే ఆ బికినీ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే దీపిక ఇలాంటి బికినీలో ధరించడం సినిమా మార్కెట్ కి ఎంతో కీలకంగా మారుతుందని తెలుస్తోంది. పఠాన్ లో అమ్మడు బికినీ సినిమాకి అదనపు అస్సె ట్ లా నిలిచింది. అందుకే పైటర్ యూనిట్ దీపిక-హృతిక్ పై చిత్రీకరించిన బికినీ సాంగ్ ని ప్రత్యే కంగా పాట మొత్తాన్ని రిలీజ్ చేసారు. ఇది కుర్ర కారులో మరింత జోష్ ని పెంచింది. సినిమాని మార్కెట్ లోకి మరింత బలంగా తీసుకెళ్లడానికి దోహద పడుతుంది. మరి అమ్మడు కల్కి 2898 లో కూడా బికినీ ట్రీట్ ఇస్తుందా? అన్నది చూడాలి.