Begin typing your search above and press return to search.

క‌ళ్లు భైర్లు క‌మ్మేలా దీపిక బ్రాస్ లెట్ ధ‌ర‌

దీపిక ప్ర‌ఖ్యాత బ్రాండ్- లోవే అనగ్రామ్ పెబుల్ దుస్తుల్లో క‌నిపించ‌గా..కార్టియర్ బ్రాండ్ కి చెందిన రూ. 1.16 కోట్ల విలువైన ట్రిపుల్ డైమండ్ బ్రాస్‌లెట్ ను ధ‌రించింది.

By:  Tupaki Desk   |   20 Jun 2024 12:56 PM GMT
క‌ళ్లు భైర్లు క‌మ్మేలా దీపిక బ్రాస్ లెట్ ధ‌ర‌
X

మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD' ఈ నెలాఖ‌రున విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ముంబై ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దీపికా పదుకొణె ఎంతో సంద‌డిగా క‌నిపించింది. ప్ర‌భాస్, అమితాబ్ లాంటి స‌హ‌చ‌ర స్టార్ల‌తో ఎంతో స‌ర‌దాగా జోవియ‌ల్ గా క‌నిపించారు. వేదిక‌పై స్టార్లు ముదురు లేదా నలుపు రంగు దుస్తులను ధరించడంతో ఈవెంట్ కోసం డార్క్‌ థీమ్ ని అనుస‌రించార‌ని అర్థ‌మైంది.

అయితే వేదిక‌పై ఉన్న తారాగ‌ణంలో దీపిక ప‌దుకొనే పైనే ప్ర‌జ‌ల క‌ళ్ల‌న్నీ. నిండు గ‌ర్భిణి అయిన దీపిక ప‌దుకొనే బేబి బంప్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌గా, మ‌రో కోణంలో ఈ బ్యూటీ ధ‌రించిన డైమండ్ బ్రాస్‌లెట్‌ అత్యంత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. అత్యంత ఆకర్షణీయమైన పాంథెర్ డి కార్టియర్ బ్రాస్‌లెట్.. 18K తెల్ల బంగారంతో రూపొందించిన‌ది. దీపిక పదుకొణె అద్భుతమైన లోవే అనగ్రామ్ పెబుల్ దుస్తులను ధ‌రించి కాంబినేష‌న్ గా కార్టియర్ ఆభరణాలను ఎంపిక చేసుకుంది.

బాలీవుడ్‌ని ఏలుతున్న రాణి దీపికా పదుకొణె న‌టించిన‌ మొద‌టి తెలుగు చిత్రం 'క‌ల్కి' కోసం ఆస‌క్తిగా వేచి చూస్తున్నాన‌ని తెలిపింది. ఇందులో త‌న‌ పాత్ర చాలా స‌ర్ ప్రైజింగ్ గా ఉంటుంద‌ని ఇప్ప‌టికే వెల్ల‌డించింది. దీపిక గర్భం దాల్చినప్పటి నుండి చాలా అరుదుగా బహిరంగంగా కనిపించింది. ముంబై ఈవెంట్‌లో అద్భుతమైన నలుపు దుస్తులలో స్టైలిష్‌గా కనిపించింది.

దీపిక ప్ర‌ఖ్యాత బ్రాండ్- లోవే అనగ్రామ్ పెబుల్ దుస్తుల్లో క‌నిపించ‌గా..కార్టియర్ బ్రాండ్ కి చెందిన రూ. 1.16 కోట్ల విలువైన ట్రిపుల్ డైమండ్ బ్రాస్‌లెట్ ను ధ‌రించింది. పాంథెర్ డి కార్టియర్ బ్రాస్‌లెట్ 18 క్యారెట్ తెల్ల బంగారంతో రూపొందించ‌గా, మిరుమిట్లుగొలిపే పచ్చలు వజ్రాలతో అలంకరించడం మ‌రో ఎత్తు. కల్కి 2898 AD చిత్రం 27 జూన్ 2024న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మ‌ల‌యాళ‌ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.