నాన్న నేర్పించిన దారిలో దీపిక ఇప్పుడిలా!
బాలీవుడ్ నటి దీపికా పదుకొణే గర్బం దాల్చిన దగ్గర నుంచి ఎంతో కేరింగ్ తీసుకుంటుంది.
By: Tupaki Desk | 11 July 2024 10:30 AM GMTబాలీవుడ్ నటి దీపికా పదుకొణే గర్బం దాల్చిన దగ్గర నుంచి ఎంతో కేరింగ్ తీసుకుంటుంది. కమిట్ అయిన ప్రాజెక్ట్ లన్నీ పూర్తి చేసిన నేపథ్యంలో ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ఇంట్లోనే గడుపుతుంది. ప్రస్తుతం నెలలు నిండుతోన్న సమయం కూడా. దీంతో ఇంట్లోనే సమయాన్ని గడుపుతుంది. అవసరం మేర భర్తతో కలిసి బయటకు రావడం మినహా మరే కార్యక్రమాలు పెట్టుకోలేదు. తాజాగా ఆమె ఎంతో ప్రశాంతవమైన వాతవావరణంలో సమయాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది.
ఆకాశం, పువ్వులు , సముద్రం వంటి అందమైన బొమ్మల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తానెంత ప్రశాంతంగా ఉందన్నది చెబుతుంది. ప్రకృతిలో ఒడిలో ఆరుబయట సమయం గడపడం, విశ్రాంతి తీసుకోవడం, అవసరం మేర చిన్నపాటి ఎక్సరసైజ్ లు చేయడం వంటివి పనిగా పెట్టుకుంది. తాజాగా ఆ మూవ్ మెంట్స్ ని ఉద్దేశించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది.
`నేను కొంత సమయం పాటు పూర్తి భిన్నమైన లోకంలోకి వెళ్లిపోతున్నాను. రెగ్యులర్ స్పాట్ కి భిన్నంగా అదెంతో అహ్లాదాన్ని పంచుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ లోకి ఎలాంటి చెడు ఆలోచనలు రానివ్వను. పూర్తి గా నాకు కావాల్సినంత స్వేచ్ఛ తీసుకుంటాను. ఇది నాన్న నాకు నేర్పించారు. ఇప్పుడు ఆయన పద్దతినే నేను ఫాలో అవుతున్నాను. నిజంగా మనసంతా ఉల్లాసంగా ఉంది.
ప్రెష్ మైండ్ తో పనులు చేసుకుంటున్నాను` అని తెలిపింది. మొత్తానికి దీపిక పాపాయికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. నెలలు నిండే సమయంలో ఈ సమయం ఎంతో కీలకమైనది. ఒత్తిడికి గురి కాకూడదు. ఆందోళన చెందకూడదు. రెగ్యులర్ గా డాక్టర్ చెకప్ లకు హాజరవుతుంది. అతి త్వరలో రణవీర్ -దీపిక ఇంట బుల్లి పాపాయి అడుగు పెడుతుంది.