ఆ రెంజ్ లో ఓ రేంజ్ లో దీపిక!
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే స్టైలిష్ ఎంపికల గురించి చెప్పాల్సిన పనిలేదు. ట్రెండ్ ని ఫాలో అవ్వడంలో ముందుంటుంది.
By: Tupaki Desk | 25 Nov 2023 11:30 AM GMTబాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే స్టైలిష్ ఎంపికల గురించి చెప్పాల్సిన పనిలేదు. ట్రెండ్ ని ఫాలో అవ్వడంలో ముందుంటుంది. ఎలాంటి ఎంపికలైతే అమ్మడిని స్టైలిష్ గా ప్రోజెక్ట్ చేస్తాయో! పక్కాగా తెలిసిన బ్యూటీ. అలాంటి వాటిలో మెరిసేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంది. సందర్భాన్ని బట్టి డిజైనర్ దుస్తుల్ని ఎంపిక చేసుకుంటుంది. ఆల్ట్రామోడ్రన్ బ్యూటీగా నెటి జనులు ముందుకొస్తుంది.
తాజాగా దీపిక ఆరెంజ్ కలర్ దుస్తుల్లో ఓ రేంజ్ ని చూపించింది. ఇదిగో ఇక్కడిలా ఆరెంజ్ రంగు షూట్ ధరించి చూపరులను ఆకట్టుకుంటుంది. ఇన్నర్ లో డార్క్ రెడ్ బనియన్ ధరించింది. అమ్మడు కెమెరా ఫోజ్ వావ్ అనిపిస్తుంది. కాలు మీద కాలేసుకుని..చేతులతో దండ కట్టుకుని... కళ్లు పెద్దవి చేసి సైడ్ గా చూస్తూ ఫోజులిచ్చింది. సన్నని చైన్ నెక్ ని మరింత అందంగా తీర్చిదిద్దింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జా లంలో వైరల్ గా మారింది. దీపిక ని ఆరెంజ్ దుస్తుల్లో చూసి అభిమానులు వావ్ అనకుండా ఉండలే కపోతున్నారు.
ఇక బాలీవుడ్ దీపికా పదుకొణే జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే `జవాన్` తో మరో భారీ సక్సస్ ఖాతాలో వేసుకుంది. మెయిన్ రోల్ నయనతార పోషించినా..అంతకు మించిన బలమైన పాత్రలో దీపిక మెరిసింది. గెస్ట్ రోల్ అని ప్రోజెక్ట్ చేసినా దీపిక పాత్ర మాత్రం ఎంతో శక్తివంతమైంది. కానీ చిత్ర యూనిట్ ఆ పాత్రని గెస్ట్ అప్పిరియన్స్ గానే హైలైట్ చేసారు? నయనతార ఫీలవుతుందని అలా ప్రోజెక్ట్ చేసారా? ఏంటా? అన్నది తెలియదు గానీ...దీపిక పాత్ర మాత్రం ఎమోషనల్ గా ఎంతో కనెక్ట్ అయింది.
ఇక ప్రాజెక్ట్ -కె తో టాలీవుడ్ లోనూ లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో జత కడుతుంది. డార్లింగ్ కటౌట్ కి తగ్గ హీరోయిన్. దీంతో ఆన్ స్క్రీన్ పై ఈ జోడీ ని చూడటానికి అభిమానులెంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.