Begin typing your search above and press return to search.

పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన దీపిక ప‌దుకొనే

ఆదివారం ఉదయం (సెప్టెంబర్ 8) ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో దీపికా పదుకొణె ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని స‌మాచారం..

By:  Tupaki Desk   |   8 Sep 2024 8:19 AM GMT
పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన దీపిక ప‌దుకొనే
X

భారతీయ సినిమా అగ్ర తారలలో ఒకరైన దీపికా పదుకొణె ఇటీవ‌లే 'క‌ల్కి 2989 ఏడి' సినిమాతో ద‌క్షిణాది వారికి ప‌రిచ‌య‌మ‌య్యారు. దీపికకు ఇప్పుడు తెలుగులోను భారీ ఫాలోయింగ్ ఉంది. త‌దుప‌రి క‌ల్కి 2లోను దీపిక న‌టించ‌నుంది. తాజా స‌మాచారం మేర‌కు దీపిక‌ - రణవీర్ సింగ్ జంట శుభ‌వార్త చెప్పింది. ఈ దంప‌తులు తల్లిదండ్రులు అయ్యారు. వారు ఆనందంగా తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం (సెప్టెంబర్ 8) ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో దీపికా పదుకొణె ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని స‌మాచారం..

దీపికా పదుకొణెకు గడువు తేదీ సెప్టెంబర్ చివరి వారం అని చెప్పినప్పటికీ డాక్టర్ అంచనా కంటే చాలా ముందుగానే ఆమె ఈరోజు బిడ్డకు జన్మనిచ్చింది. రణవీర్ సింగ్ - దీపిక ఇద్దరూ ఇటీవ‌ల‌ ముంబైలోని సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లి శనివారం ప్రార్థనలు చేశారు. ఒక రోజులోనే ఈ ప‌రిణామం. దీపిక నేడు బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు.

దీపికా పదుకొణె ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను గర్భం దాల్చినట్లు ప్రకటించింది. ఇప్ప‌టికే ఈ భామ‌ తన సినిమా కమిట్‌మెంట్‌లను వేగంగా పూర్తి చేసింది. క‌ల్కి ప్రమోషనల్ ఈవెంట్‌లో ఒక్కసారి మాత్రమే కనిపించింది. ఆ స‌మ‌యంలో దీపిక బేబి బంప్ గురించి వెల్ల‌డైంది. ప్ర‌భాస్- అమితాబ్ త‌దిత‌రుల‌తో ఎంతో జోవియ‌ల్ గా క‌లిసి మెలిసి క‌నిపించింది దీపిక‌. యాధృచ్ఛికంగానే అయినా క‌ల్కి చిత్రంలో దీపిక గ‌ర్భిణిగా క‌నిపించింది.