జెబ్బల గౌనులో దీపిక బేబి బంప్!
దీపికా పదుకొణే గర్భం దాల్చిన దగ్గర నుంచి బయట పెద్దగా కనిపించడం లేదు.
By: Tupaki Desk | 24 May 2024 3:45 PM ISTదీపికా పదుకొణే గర్భం దాల్చిన దగ్గర నుంచి బయట పెద్దగా కనిపించడం లేదు. వీలైనంత వరకూ ఇంట్లోనే సమయం గడుపుతుంది. బేబి బంప్ ఫోటోలు మాత్రం ఎక్కడా లీక్ అవ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. మోబైల్ ఫోన్ కి కూడా దూరంగా ఉంటుంది. ఫోన్ నుంచి విపరీతమైన రేడియషన్ ప్రమాదం పొంచి ఉండటంతో ఫోన్ కి కూడా దూరమైంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె యాక్టివిటీ పూర్తిగా కనుమరుగైపోయింది.
ఇల్లు..ఇంట్లో కాసేపు వ్యాయామం..కుటుంబ సభ్యులతో సమయం గడపడం..షూటింగ్ నుంచి రణవీర్ ఇంటికొస్తే ఆయన పనులు చూడటం తప్ప మరో వ్యాపకం పెట్టుకోలేదు. కొత్త సినిమాలకు కూడా డేట్లు ఇవ్వడం లేదు. ప్రసవం తర్వాత ఎలాగూ ఆరు నెలలు తప్పక విశ్రాంతి అవసరం. అప్పటి పేషెంట్ కండీషన్ బట్టి విరామం అన్నది ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కొత్త సినిమాలకు అడ్వాన్స్ లు కూడా తీసుకోలేదు.
ఇటీవలే ఎన్నికల సందర్భంగా ముంబైలో ఓటు వేయడానికి బయటకు వచ్చారు. అదీ రణవీర్ దగ్గరుండి ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చాడు కాబట్టి రాగలిగింది. తాజాగా నెట్టింట్లో దీపిక బేబి బంప్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో దీపిక పసుపు రంగు జెబ్బల గౌను ధరించింది. గౌను అందాన్ని అభిమానులతో పంచుకునే పనిలో భాగంగా ఇలా కొన్ని ఫోటోల్ని నెట్టింట్లోకి వదిలింది. ఈ డిజైన్ లో ఉన్న కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది.
కెమెరా అప్పిరియన్స్ కి అనుగణంగా వివిధ భంగిమల్లో ఫోజులిచ్చింది. దీపిక గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి ఫోటో షూట్లలో పాల్గొనలేదు. తొలిసారి ఇలా పసుపు గౌనులో అందర్నీ పసుపు మయం చేసింది. ప్రస్తుతం ఈఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీపిక ఎంతో అందంగా ఉందంటూ అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. అలాగే అభిమాన హీరోయిన్ కి పండంటి బిడ్డ పుట్టాలంటూ కోరుకుంటున్నారు.
ప్రస్తుతం దీపిక పదుకొణే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న `కల్కి 2898` లో నటిస్తోంది. అలాగే హిందీలో `సింగం ఎగైన్` లో నటిస్తోంది. ఇందులో తన పాత్రకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసింది. ఈసినిమా షూటింగ్ పూర్తవ్వడానికి..రిలీజ్ అవ్వడానికి సమయం పడుతుంది.