Begin typing your search above and press return to search.

ఇంకా స్టార్ హీరోయిన్ గుండెల్లో మాజీ ప్రియుడు?

దీపికా పదుకొణె త‌న పాత స్నేహితుల‌ను అస్స‌లు మ‌ర్చిపోలేదు. ముఖ్యంగా తన మాజీ ప్రియుడు ర‌ణ‌బీర్ క‌పూర్‌ని అస్స‌లు మర్చిపోలేదు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 1:30 AM GMT
ఇంకా స్టార్ హీరోయిన్ గుండెల్లో మాజీ ప్రియుడు?
X

దీపికా పదుకొణె త‌న పాత స్నేహితుల‌ను అస్స‌లు మ‌ర్చిపోలేదు. ముఖ్యంగా తన మాజీ ప్రియుడు ర‌ణ‌బీర్ క‌పూర్‌ని అస్స‌లు మర్చిపోలేదు. ల‌వ్ బ్రేక‌ప్ అయిన ఇన్నేళ్ల త‌ర్వాత ర‌ణ‌బీర్ ఫోటోని షేర్ చేసి అత‌డికి ధ‌న్య‌వాదాలు తెలిపింది ఒక కార‌ణంతో. కాజ్ ఏదైనా కానీ ఇప్పుడు దీపిక‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. వివ‌రాల్లోకి వెళితే...

క‌థానాయికగా కెరీర్ ప్రారంభించి దీపికా పదుకొణె బాలీవుడ్‌లో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అభిమానులంతా ఈ రోజును చాలా ప్ర‌త్యేకంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. దీపిక ద‌శాబ్ధంన్న‌ర కెరీర్ లో ప‌ని చేసిన సినిమాల పోస్ట‌ర్ల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తూ శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. దీపిక ప‌దుకొనే కూడా ఈ ఆనంద స‌మ‌యంలో త‌న‌ అభిమానులకు జ‌వాబు దారీగా ఉంటూ..తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కొన్ని ఫోటోలను ప్ర‌తిగా షేర్ చేసి ఫ్యాన్స్ కు తన కృతజ్ఞతలు తెలిపింది. అయితే దీపిక షేర్ చేసిన ఫోటోల‌లో త‌న‌ మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ ఫోటో ప్ర‌త్యేకంగా హైలైట్ అయింది. కానీ ఇది ఊహించ‌ని అభిమానుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

రెడ్డిట్ యూజ‌ర్స్ లో కొంద‌రు దీపిక‌ను తిట్టిపోస్తున్నారు. రణబీర్ కపూర్‌తో ఇంకా దీపిక ప్రేమ‌లో ఉన్నారని, అందుకే అత‌డి ఫోటోని ఇంత ప్రేమ‌గా షేర్ చేసింద‌ని కామెంట్ చేస్తున్నారు. దీపిక త‌న భర్త, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌తో ఉన్న ఒక ఫోటోని కూడా ఎందుకు షేర్ చేయ‌లేదు? అంటూ చాలా మంది నెటిజ‌నులు ప్ర‌శ్నిస్తున్నారు.

`కాఫీ విత్ కరణ్ 8`లో ఎపిసోడ్ ఫ్లాప‌య్యాక‌.. దీపిక‌ సోషల్ మీడియా ట్రోల‌ర్స్ రాడార్‌లో ఉంది. గ‌తంలో ఓ వివాదంలోను ఇలానే ట్రోలింగ్ ని ఎదుర్కొంది. BHU యూనివర్సిటీలో దీపికా పదుకొనే గత జీవితంపై చేసిన స్కిట్ వీడియో ఒకటి వైరల్ కావడంతో ట్రోలింగ్ మరో స్థాయికి చేరుకుంది. అయితే దీపికా పదుకొణె అభిమానుల్లో ఒక సెక్ష‌న్ త‌న‌కు భారీ మద్దతునిచ్చారు. ట్రోల‌ర్స్ ఇరుకు మనస్తత్వంపై విరుచుకుపడ్డారు. మ‌ళ్లీ ఇప్పుడు ఇలా త‌న భ‌ర్త ఫోటో కాకుండా మాజీ ప్రియుడు ర‌ణ‌బీర్ ఫోటోని షేర్ చేయ‌డంతో మ‌రోసారి ట్రోల‌ర్స్ తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు. ర‌ణ‌బీర్ తో సుదీర్ఘ కాలం ప్రేమాయ‌ణం సాగించిన దీపిక‌, అటుపై అత‌డి నుంచి విడిపోయింది. క‌త్రిన‌తో ర‌ణ‌బీర్ ప్రేమాయ‌ణం కార‌ణంగానే ఈ బ్రేక‌ప్ అయింద‌ని టాక్ వినిపించింది