దీపికా పదుకునే.. అందుకే నెంబర్ వన్ అనేది!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దీపికా పదుకునే తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతోంది.
By: Tupaki Desk | 26 Aug 2024 8:03 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దీపికా పదుకునే తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతోంది. ఇండియన్ హీరోయిన్స్ లలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీపికా పదుకునే ప్రస్తుతం ఒక్కో సినిమాకి 18 నుంచి 20 కోట్ల రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఈ స్థాయికి ఎదగలేదు. ఇదంతా కేవలం ఆమెకున్న మార్కెట్ వేల్యూ బట్టి ఇస్తున్నారని చెప్పొచ్చు.
అలాగే దేశంలోనే అత్యధిక బ్రాండ్ వేల్యూ ఉన్న హీరోయిన్ గా కూడా దీపికా పదుకునే ఉంది. దీపికా పదుకునే ఖాతాలో ఇప్పుడు 1000+ కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకున్న సినిమాలు నాలుగు ఉన్నాయి. వాటిలో పఠాన్, జవాన్, కల్కి 2898ఏడీ ఇండియన్ సినిమాలు కాగా హాలీవుడ్ మూవీ ట్రిపుల్ ఎక్స్ రిటర్న్స్ ఆఫ్ జెండర్ కేజ్ ఏకంగా 2300 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది.
పఠాన్ 1060 కోట్లు, జవాన్ 1143, కల్కి 1150 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి. ఏ ఇండియన్ హీరోయిన్ ఖాతాలో కూడా ఇన్ని వెయ్యి కోట్ల సినిమాలు లేవు. వీటి తర్వాత అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలు చూసుకుంటే 422 కోట్లతో చెన్నై ఎక్స్ ప్రెస్, 318 కోట్లతో ఏ జవానీ ఏ దివానీ, 367 కోట్లతో బాజీరావ్ మస్తానీ సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు దీపికా పదుకునే సినిమాలన్నింటి కలెక్షన్స్ చూసుకుంటే సుమారు 9808 కోట్ల రూపాయిలు ఉన్నాయి.
మరో 182 కోట్ల కలెక్షన్స్ సాధిస్తే ఇండియాలోనే ఫస్ట్ టైం 10000 కోట్ల కలెక్షన్స్ తన సినిమాలతో సాధించిన హీరోయిన్ గా నిలబడిపోతుంది సింగం అగైన్ సినిమాలో దీపికా పదుకునే ఈ క్లబ్ లో చేరిపోతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. నెక్స్ట్ కల్కి పార్ట్ 2లో దీపికా పదుకునే పాత్ర మరింత బలంగా ఉంటుంది.
ఆ సినిమా కనీసం 2000 కోట్ల కలక్షన్స్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యే సమయానికి తన సినిమాలతో కనీసం 15000 కోట్ల కలెక్షన్స్ అయితే అందుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.