IMDb టాప్-100 జాబితాలో 'కల్కి 2989 AD' నటి
100 మంది తారల జాబితాలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఉన్నారు.
By: Tupaki Desk | 30 May 2024 3:58 AM GMTప్రఖ్యాత ఐఎండిబి తాజా సర్వేలో `కల్కి 2989 ఏడి` నటి అగ్రపథంలో నిలిచింది. IMDb టాప్ 100 వీక్షణ(దశాబ్ధ కాలం)ల జాబితాలో భారతీయ తారలలో దీపికా పదుకొనే అగ్రస్థానంలో నిలిచింది. టాప్ 5లో షారుఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, అలియా భట్, ఇర్ఫాన్ ఖాన్ నిలిచారు. జనవరి 2014 నుండి ఏప్రిల్ 2024 వరకు ఉన్న డేటాను పరిగణనలోకి తీసుకున్న IMDb గత దశాబ్దంలో అత్యధికంగా వీక్షణలు అందుకున్న టాప్ 100 భారతీయ తారల పేర్లను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల IMDb వినియోగదారులు, అభిమానుల నుండి వచ్చిన పేజీ వీక్షణల ఆధారంగా ర్యాంకింగ్ ని ధృవీకరించారు. 100 మంది తారల జాబితాలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఉన్నారు.
జనవరి 2014 నుండి ఏప్రిల్ 2024 వరకు ఉన్న డేటాను పరిగణనలోకి తీసుకున్న IMDb గత దశాబ్దంలో అత్యధికంగా వీక్షణలు అందుకున్న టాప్ 100 భారతీయ తారల జాబితాను వెల్లడించింది. దీపికా పదుకొణె స్థిరమైన ప్రజాదరణ ఈ ప్రతిష్టాత్మక జాబితాలో తన స్థానాన్ని సుస్థిరం చేసింది. దీపిక అసాధారణమైన అప్పీల్ .. వినోద పరిశ్రమలో ప్రభావం దృష్ట్యా ఇది సాధ్యమైందని ఐఎండిబి పేర్కొంది.
2007లో షారూఖ్ ఖాన్ సరసన ఓం శాంతి ఓం అనే బ్లాక్ బస్టర్ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన దీపికా పదుకొణె దాదాపు రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన కెరీర్‌ను కొనసాగించింది. తన ఫిల్మోగ్రఫీ కాక్‌టెయిల్, యే జవానీ హై దీవానీ, పికు, చెన్నై ఎక్స్‌ప్రెస్, పఠాన్, జవాన్, పద్మావత్ వంటి బ్లాక్ బస్టర్ విజయాలు ఉన్నాయి.
2017లో దీపిక హాలీవుడ్ అరంగేట్రం చేసింది. xXx: రిటన్ ఆఫ్ జాండర్ కేజ్ లో విన్ డీజిల్‌తో కలిసి నటించింది. గ్లోబల్ స్టార్‌గా తనను తాను సుస్థిరం చేసుకుంది. దీపిక నటించిన గత మూడు చిత్రాలు 2550 కోట్లు పైగా వసూలు చేయడం ఒక సంచలనం. ఏ ఇతర భారతీయ నటికి ఇది సాధ్యం కాలేదు. కెరీర్ మ్యాటర్ కి వస్తే...దీపిక తదుపరి కల్కి 2898 ADలో కనిపిస్తుంది. ఈ చిత్రం 27 జూన్ 2024న విడుదలవుతోంది. సింఘం ఎగైన్ ఈ ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల కానుంది.
IMDb అనేది ప్రజల అభిరుచి, ఆసక్తులు, ప్రాధాన్యతల ద్వారా నిజమైన పల్స్‌ని ప్రతిబింబిస్తూ విశ్వసనీయతకు నిదర్శనంగా నిలిచింది. ప్రేక్షకులకు ఉన్నతమైన రిపోర్ట్ ని అందిస్తుందని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.