Begin typing your search above and press return to search.

దీపికా.. ఇక అసలైన టైమ్ కోసం రెడీ!

బాలీవుడ్‌ స్టార్ కపుల్‌ దీపికా పదుకొణె, రణవీర్‌ సింగ్ ఇటీవల తమ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   11 March 2024 12:39 PM GMT
దీపికా.. ఇక అసలైన టైమ్ కోసం రెడీ!
X

బాలీవుడ్‌ స్టార్ కపుల్‌ దీపికా పదుకొణె, రణవీర్‌ సింగ్ ఇటీవల తమ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. సెప్టెంబర్‌ లో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు దీపిక ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టింది. పెళ్లైన ఆరేళ్ల తర్వాత దీపిక తల్లి కాబోతుండడంతో ఫ్యాన్స్, సన్నిహితులు, సినీ ప్రముఖులు ఇప్పటికీ శుభాకాంక్షలు చెబుతున్నారు.

దీపికా పదుకొణె ఇప్పటికే సైన్ చేసిన సినిమాల షూటింగ్స్ పరిస్థితేంటని చాలా మంది నెటిజన్లతోపాటు మూవీ లవర్స్ సందేహాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సింగం ఎగైన్ మూవీలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.

అయితే ఆయా సినిమాల షూటింగ్స్ కు దీపిక బ్రేక్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఈ బ్యూటీ ముంబయి ఎయిర్ పోర్ట్ లో తళుక్కుమంది. స్టైలిష్ అవతార్ ఉన్న దీపిక.. షూటింగ్ కు బయలుదేరింది. దీంతో షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది. డెలివరీ సమయంలో సరైన విరామం తీసుకుని తన బిడ్డతో ఉండేందుకు వీలుగా దీపిక ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రభాస్ కల్కి మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది దీపికా పదుకొణె. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత.. ఆ సినిమా రిలీజ్ పై ఆందోళన వ్యక్తం చేశారు ఫ్యాన్స్. కానీ ఇప్పటికే దీపిక తన షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఫ్యాన్స్ మాత్రం దీపిక ప్రెగ్నెన్సీ కారణంగా ప్రభాస్ సినిమా రిలీజ్ ఆలస్యం కాకూడదని కోరుకుంటున్నారు.

ఇక ఆరేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న రణవీర్ సింగ్, దీపిక 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రం గోలియోం కీ రాస్లీలా రామ్ లీలా సెట్స్‌లో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత బాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాల్లో దీపిక, రణవీర్ కలిసి నటించారు. ఇలా ప్రేమలో పడ్డ వీరిద్దరూ.. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు.