ఆస్కార్ పేజీలో ఏకైక భారతీయ నటి
ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే దీపికా భర్త రణవీర్ సింగ్ స్పందించారు. అతడు మెస్మరిక్ అంటూ ఆనందం వ్యక్తం చేసాడు.
By: Tupaki Desk | 5 April 2024 7:18 AM GMTఆస్కార్ కమిటీల్లో భారతీయ ప్రతిభావంతుల పేర్లు ఇంతకుముందు వెల్లడయ్యాయి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్- 2023లో సంస్థలో చేరడానికి 398 మంది ప్రముఖ కళాకారులు ఎగ్జిక్యూటివ్ లకు ఆహ్వానాలు పంపగా టాలీవుడ్ సంగీతదర్శకుడు ఎం.ఎం.కీరవాణి-పాటల రచయిత చంద్రబోస్.. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సహా ఆర్టిస్టుల కేటగిరీ నుంచి రామ్ చరణ్- ఎన్టీఆర్ లకు ఈ జాబితాలో చోటు లభించింది. సాంకేతిక నిపుణుల్లో కీరవాణి-బోస్- సెంథిల్ పేర్లు చేరాయి. ఇది పాత విషయమే అయినా ఇప్పుడు అకాడమీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దీపిక పదుకొనే ప్రత్యక్షం కావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్.
భాజీరావ్ మస్తానీలో 'దీవానీ మస్తానీ' పాటలో దీపికా పదుకొణె ఐకానిక్ పెర్ఫార్మెన్స్ ని ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇప్పుడు ఈ పెర్ఫామెన్స్ ఆస్కార్ ఇన్ స్టా పేజీలో చేరింది. దీనికి రణవీర్ సింగ్ స్పందన అద్భుతం. తమ అభిమాన నటుడిని చూసినప్పుడు దీపికా పదుకొణె అభిమానులు ఎంతో ఎగ్జయిట్ అవుతారు. ఈసారి కూడా ఆస్కార్ ఇన్ స్టా పేజీలో చూసుకుని మురిసిపోతున్నారు. దీపికకు ఇది నిజంగా గొప్ప గౌరవంగా భావిస్తున్నారు.
శ్రేయా ఘోషల్ పాడిన దీపిక ఐకానిక్ సాంగ్ దీవానీ మస్తానీకి అకాడమీ బుధవారం నివాళులర్పించింది. అకాడమీ అధికారిక ఇన్ స్టా హ్యాండిల్ దీపిక పాటకు డ్యాన్స్ చేసిన క్లిప్‌ను షేర్ చేసింది. దీవానీ మస్తానీ బాజీరావ్ మస్తానీ (భన్సాలీ దర్శకుడు) లో క్లాసిక్ సాంగ్. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించగా, ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్ర పోషించింది. రణవీర్- దీపిక జంట రొమాన్స్ కి యూత్ ఫిదా అయింది.
ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే దీపికా భర్త రణవీర్ సింగ్ స్పందించారు. అతడు మెస్మరిక్ అంటూ ఆనందం వ్యక్తం చేసాడు. అమానులు కూడా ప్రశంసించారు. ఈ పాటలో దీపికా అందం వ్వావ్.. తనలాగా మరే ఇతర నటి ఇలా చేయగలరు? ఇది హిందీ చిత్రసీమలో ఆల్ టైమ్ గ్రేట్ హిట్‌గా నిలిచిపోతుంది.. అని అభిమాని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అకాడమీ ఎట్టకేలకు బాలీవుడ్‌కు తగిన గుర్తింపు ఇస్తోంది అని మరొకరు అన్నారు. ఇప్పటికైనా అత్యంత అందంగా చిత్రీకరించిన పాటను గుర్తించినందుకు ధన్యవాదాలు అని ఒక అభిమాని వ్యాఖ్యానించారు.
ఆస్కార్ 2023లో దీపిక
గత సంవత్సరం మార్చిలో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్‌లో దీపిక ఆస్కార్-విజేత RRR పాట 'నాటు నాటు' ప్రదర్శనను ప్రకటించింది. MM కీరవాణి స్వరపరచిన 'నాటు నాటు' కేవలం ప్రదర్శితమై, నామినేట్ కాకుండా, ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న మొదటి తెలుగు పాటగా చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఈ పాట గురించి దీపిక వ్యాఖ్యానిస్తూ.. నిజ జీవితంలో భారతీయుల మధ్య స్నేహం గురించిన చిత్రం RRRలో కీలక సన్నివేశంలో ప్లే అయ్యే పాట ఇది. విప్లవకారులు అల్లూరి సీతారామ రాజు -కొమరం భీమ్ స్నేహానికి సంబంధించిన పాట ఇది అని పరిచయం చేసారు.
తెలుగు పాట అద్భుతం.. వలసవాద వ్యతిరేక ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఈ పాట ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆదరణ దక్కించుకుంది. దీనికి YouTube టిక్‌టాక్‌లలో మిలియన్ల కొద్దీ వీక్షణలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లలో ప్రేక్షకులు నృత్యం చేస్తున్నారు. ఆస్కార్‌కి నామినేట్ అయిన భారతీయ సినిమా నుండి మొట్టమొదటి పాట ఇది అని దీపిక ఆస్కార్స్ వేదికపై పరిచయం చేసింది.