దీపికా పదుకొనె డిమాండ్ కి నిర్మాతలు షాక్..!
కల్కి సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రం కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుందని టాక్.
By: Tupaki Desk | 10 March 2024 11:30 PM GMTభాషతో సంబంధం లేకుండా ఈమధ్య అన్ని సినిమాలు నేషనల్ వైడ్ గా సూపర్ స్టామినా చూపిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాల ప్రభంజనం గురించి తెలిసిందే. బాహుబలితో మొదలైన ఈ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తెలుగు సినిమా అంటే ఒకప్పుడు చిన్న చూపు చూసిన తారలంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ వస్తే నటించేందుకు రెడీ అనేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ భామలు అలియా భట్, దీపికా పదుకొనె, జాన్వి కపూర్, శ్రద్ధ కపూర్, దిశా పటాని, కియరా అద్వాని తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు.
ప్రభాస్ కల్కి సినిమాతో తొలిసారి తెలుగు సినిమా చేస్తుంది దీపిక పదుకొనె. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల పైన బడ్జెట్ తో వస్తున్న కల్కి సినిమాలో నటించేందుకు దీపిక పదుకొనె 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తుంది. బాలీవుడ్ లో కూడా సినిమాకు 10 నుంచి 15 కోట్ల దాకా పారితోషికం అందుకుంటున్న దీపిక పదుకొనె తెలుగు సినిమాల్లో కూడా అదే రేంజ్ డిమాండ్ చేస్తుంది.
కల్కి సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రం కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుందని టాక్. ఈ సినిమాలో నటించేందుకు అమ్మడు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. కల్కి సినిమాకు 10 కోట్ల దాకా తీసుకున్న అమ్మడు అల్లు అర్జున్ సినిమాకు మరో ఐదు కోట్లు అదనంగా అడుగుతుందని తెలుస్తుంది. అంటే ముచ్చటగా 15 కోట్ల దాకా దీపిక డిమాండ్ చేస్తుంది.
నేషనల్ వైడ్ గా దీపికాకు ఉన్న ఫాలోయింగ్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుంటే ఆమె అడిగిన రెమ్యునరేషన్ సరైనదే అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ త్రివిక్రం ఈసారి పాన్ ఇండియా సబ్జెక్ట్ తో వస్తున్నారని తెలుస్తుంది. గుంటూరు కారం తర్వాత త్రివిక్రం కొద్దిపాటి గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ తో సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నారు. పుష్ప 2 రిలీజ్ వరకు బన్నీ బిజీ కాబట్టి ఈలోగా కథ పూర్తి చేసుకునే ఆలోచనలో ఉన్నాడు గురూజీ. సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్ అనగానే అల్లు ఫ్యాన్స్ సినిమాపై మరింత ఎగ్జైటెడ్ గా ఉన్నారు. పుష్ప 2 తర్వాత బన్నీ ఇమేజ్ మరింత పెంచేలా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రం.