దీపిక నటించిన మొదటి తెలుగు చిత్రం ఏది?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె `కల్కి 2898 AD` కంటే ముందే ఒక తెలుగు చిత్రంలో నటించింది
By: Tupaki Desk | 25 Jun 2024 12:23 PM GMTకత్రిన మొదటి తెలుగు సినిమా -మల్లీశ్వరి.. ప్రీతిజింతా మొదటి తెలుగు సినిమా- రాజకుమారుడు.. ఆలియా మొదటి తెలుగు సినిమా- ఆర్.ఆర్.ఆర్.. అయితే దీపిక పదుకొనే మొదటి తెలుగు సినిమా ఏది? అంటే నెటిజనులు `కల్కి 2898 ఏడి` అని వెంటనే చెబుతారు. కానీ ఇది నిజమా? అంటే కానే కాదు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె `కల్కి 2898 AD` కంటే ముందే ఒక తెలుగు చిత్రంలో నటించింది. కల్కి ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ కల్కి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో దీపిక నటించిన మొదటి సినిమా ఇది కాదని తేలింది. దీపిక మొదట్లో 2009లో జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన `లవ్ 4 ఎవర్`తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో రణదీప్, మృధుల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో దీపిక ప్రత్యేక పాటలో కనిపిస్తుందని ప్రచారమైంది. దీపికపై షూటింగ్ కూడా పూర్తయింది. అయితే రకరకాల కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. అలా దీపిక తెలుగు అరంగేట్రం అనూహ్యంగా ప్రేక్షకుల ముందుకు రాకుండా పోయింది. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ సరసన `కల్కి 2898 AD`లో ముఖ్యమైన పాత్రతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెడుతోంది.
కల్కి చిత్రంలో దీపికతో పాటు దిశా పటానీ మరో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపిక సుమతి (SUM-80)గా ప్రేక్షకులకు పరిచయం కానుంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్, శోభన తదితరులు ఈ చిత్రంలో నటించారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ ఎపిక్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. కల్కి 2898 AD చిత్రం 2D, 3D, IMAX, 4DX ఫార్మాట్‌లలో విడుదలవుతుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా టికెట్ బుకింగుల వైపు చూస్తున్నారు. దీంతో బుక్ మై షో క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు-తమిళం-హిందీ సహా పలు భాషల్లో విడుదల కానుంది.