పోలింగ్ కేంద్రం వద్ద బేబి బంప్ లుక్ లో దీపిక!
దీపికా పదుకొణే గర్భం దాల్చిన దగ్గర నుంచి బయట పెద్దగా కనిపించడం లేదు.
By: Tupaki Desk | 20 May 2024 10:46 AM GMTదీపికా పదుకొణే గర్భం దాల్చిన దగ్గర నుంచి బయట పెద్దగా కనిపించడం లేదు. వీలైనంత వరకూ మీడియా కెమారాలకు ఎంత దూరంగా ఉంటే? అంత మంచిదనుకుందో ఏమో బాలీవుడ్ మీడియాకి ఎక్కడా చిక్కడం లేదు. పూర్తి చేయాల్సిన షూటింగ్ లు అన్నీ పూర్తి చేసింది. దీంతో ఇంట్లోనే ఉంటుంది. ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ఇంటికే పరిమితమైంది. సాయంకాలం వరకూ ఇంట్లో ఉండటం హబ్వీ షూట్ ముగించుకుని వస్తే వీకెంట్ అలా బయటకు వెళ్లడం తప్ప! దీపిక ఎలాంటి సినిమాలకు సంబంధించి యాక్టివిటీస్ లో పాల్గొనడం లేదు.
దీంతో ఆమె బేబి బంప్ కూడా ఎక్కడా వైరల్ అవ్వలేదు. తాజాగా నేడు ముంబైలో ఎన్నికల సందర్భంగా దీపిక పదుకోణే భర్త రణవీర్ సింగ్ తో కలిసి ఓటేసేందుకు వచ్చింది. ఇద్దరు జంటగా కలిసొచ్చారు. భార్యని ఎంతో జాగ్రత్తగా బూత్ వద్దకు తీసుకెళ్లి ఓటేయించాడు రణవీర్. వాళ్ల రాక గుర్తించిన మీడియా కవర్ చేసింది. ఇందులో దీపిక వైట్ కలర్ షర్ట్ లో లైట్ బ్లూ జీన్స్ ధరించారు. ఆ బట్టలు శరీరానికి ఎంతో సౌకర్యంగా ఉన్నాయి. దీపిక పొట్ట భాగం మునుపటి కంటే బాగా ఎత్తుగా మారింది.
ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవి చూసిన దీపిక అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీపికకి పండంటి బిడ్డ పుట్టాలంటూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం దీపిక పదుకొణే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న `కల్కి 2898` లో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో కూడా దీపిక పాల్గొనే అవకాశం లేదని ఇప్పటివకే వార్తలొచ్చాయి.
సినిమాకి సంబంధించిన ప్రచారమంతా తాను ఇంట్లోనే ఉండి చేస్తుందని అంటున్నారు. ఇంట్లో కూర్చుని కొన్ని ప్రచార వీడియోలు రిలీజ్ చేస్తుందని సమాచారం. అలాగే హిందీలో `సింగం ఎగైన్` లో నటిస్తోంది. ఇందులో తన పాత్రకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసింది. ఈసినిమా షూటింగ్ పూర్తవ్వడానికి..రిలీజ్ అవ్వడానికి సమయం పడుతుంది.