Begin typing your search above and press return to search.

కల్కి అప్డేట్... మోడ్రన్ లక్ష్మిదేవి 'పద్మ'

ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరుగుతున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   28 May 2024 12:52 PM GMT
కల్కి అప్డేట్... మోడ్రన్ లక్ష్మిదేవి పద్మ
X

ప్రభాస్, నాగ్ అశ్విన్‌ కాంబోలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల బుజ్జీ ని పరిచయం చేయడం ద్వారా అంచనాలు మరింతగా పెంచారు. ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరుగుతున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.

కల్కి లో ప్రభాస్ ను భైరవ గా చూడబోతున్నాం. ఇక అమితాబచ్చన్ ను అశ్వత్థామ పాత్రలో చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటికే అధికారికంగా రివీల్‌ చేయడం జరిగింది. ఇతర పాత్రల పేర్లు ఏంటి, వారు ఎలా ఉండబోతున్నారు అనే విషయమై సస్పెన్స్ నెలకొంది.

ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకునేను హీరోయిన్‌గా నటింపజేయడం జరిగింది. ఆమె కు సంబంధించిన లుక్ ను ఇప్పటికే రివీల్‌ చేశారు. అయితే ఆమె పాత్ర పేరు విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.

ప్రస్తుతం కల్కి లో దీపిక పదుకునే యొక్క పాత్ర మరియు ఆమె పేరుకు సంబంధించిన విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో దీపికా పదుకునేను పునర్జన్మ పొందిన లక్ష్మిదేవి పాత్రలో చూడబోతున్నామట. అంటే మోడ్రన్ లక్ష్మి దేవిని పద్మ అనే పేరుతో కల్కి లో దర్శకుడు చూపించబోతున్నాడు.

ప్రభాస్ మరియు దీపిక పదుకునేల మధ్య ఉండే సంబంధం, ఇద్దరి కాంబో సన్నివేశాలు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

కల్కి సినిమాలో యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ప్రధానమైన పాత్రలో కనిపించబోతున్నాడు. దుల్కర్ సల్మాన్‌, దిశా పటానీతో పాటు ఇంకా ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమా హాలీవుడ్‌ లో సైతం విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

రూ.700 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమాను రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1500 కోట్ల నుంచి రూ.2000 కోట్ల వరకు వసూళ్లు చేస్తుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులతో పాటు ప్రభాస్‌ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ కి ఉన్న స్టామినా నేపథ్యంలో కల్కి వసూళ్ల పై అందరిలో ఆసక్తి నెలకొంది.