బెడ్ రూమ్ లో భర్తతో దీపిక డాన్సు తెల్లారేవరకూ!
ఒక్కోసారి ఆ డాన్సు తెల్లారవేరకూ ఉంటుంది. అంతగా డాన్సు మత్తులో ఇద్దరం మునిగిపోతాం. డాన్స్ చేస్తుంటే మాకస్సలు సమయం తెలియదు' అని అంది.
By: Tupaki Desk | 15 Nov 2023 11:30 AM GMTవెండి తెరపై భార్యభర్తలు రణవీర్ సింగ్- దీపికా పదుకొణే కలిసి చేసిన డాన్సులు చూసాం. సీన్ డిమాండ్ చేసిన సందర్భంలో విరహగీతాల్లో సైతం ఆ జోడీ ఎంతగానో రక్తి కట్టించింది. పెళ్లికి ముందు..పెళ్లి తర్వాత ఎన్నో సినిమాల్లో ఆడి పాడారు. బాలీవుడ్ కల్చర్ లోనే రొమాన్స్ ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా చర్చిం చాల్సిన పనిలేదు. మరి ఈ జోడీ ఆఫ్ ది స్క్రీన్ లోనూ అంతకు మించి డాన్సులతో అలరిస్తారా? ఇద్దరు ప్రయివేట్ స్పేస్ లో సైతం కలిసి డాన్సులు చేస్తారా? అంటే అవుననే అంటోంది దీపిక పదుకొణే.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ అవ్వడం కోసం ఇద్దరు బెడ్ రూమ్ ..మ్యూజిక్ రూమ్ లో సైతం కలిసి డాన్సులు చేస్తుంటారుట. 'రణవీర్ షూటింగ్ ముగించుకుని ఒక్కోసారి అర్దరాత్రి ఇంటికొస్తాడు. నేను తెల్లవారు జామునే షూటింగ్ కి వెళ్లిపోతాను. ఇలా ఇంత టైట్ షెడ్యూల్ ఉన్నప్పుడు వారాంతంలో ఓరోజును మాత్రం కలిసి గడపడానికి కేటాయిస్తాం. నాకు డాన్సు అంటే ఇష్టం.
రణవీర్ కి కూడా ఇష్టమే. కానీ నా అంత కాదు. అలా కలిసినప్పుడు ఇద్దరు పాటలు వింటూ ..రూమ్ లోనే కలిసి డాన్సు చేస్తాం. ఒక్కోసారి ఆ డాన్సు తెల్లారవేరకూ ఉంటుంది. అంతగా డాన్సు మత్తులో ఇద్దరం మునిగిపోతాం. డాన్స్ చేస్తుంటే మాకస్సలు సమయం తెలియదు' అని అంది. మొత్తానికి భార్యభర్తలు ఇద్దరు బెడ్ రూమ్ లో సైతం డాన్సులు చేస్తారు? అన్న సంగతి చాలా కాలానికి తెలిసింది.
ప్రస్తుతం భార్యభర్తలిద్దరు ఎంత బిజీగా ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. ఎవరి సినిమాలతో వాళ్లు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. దీపికా పదుకొణే ప్రాజెక్ట్ -కెతో టాలీవుడ్ కి పరిచయమవుతుంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తోంది.