ఆ స్టార్ సినిమాలో దీపిక గెస్ట్ అయితే ఛార్జ్ లెస్!
ఈ సినిమాకి ఒక్క రూపాయి కూడా తీసుకోలే దుట. షారుక్ పై ఉన్న అభిమానంతో ఉచితంగా నటించినట్లు తెలిపింది.
By: Tupaki Desk | 15 Sep 2023 12:30 PM GMTఇటీవలే రిలీజ్ అయిన 'జవాన్' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 500 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. పాన్ ఇండియాలో సినిమా అన్ని చోట్లా భారీ వసూళ్లని రాబడుతుంది. ఈ చిత్రాన్ని స్వయంగా షారుక్ ఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ లోనే నిర్మించారు. ఇక నయనతారకి భారీగానే పారితోషికం చెల్లించారు. ఇందులో అమ్మడు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించడం తో ..హీరోకు ధీటుగానే ఆ రోల్ సాగింది.
అలాగే దర్శకుడు అట్లీ కుమార్ కూడా భారీనే ఛార్జ్ చేసారు. మరి గెస్ట్ పాత్రలో పోషించిన దీపిక పదుకొణే ఈ సినిమాకి ఎంత పారితోషికం తీసుకున్నారు. నిజానికి దీపిక గెస్ట్ పాత్రకంటే పెద్ద పాత్ర అదే. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో షారుక్ భార్య పాత్ర పోషించింది. అందులో ఆమె గర్బం దాల్చడం..జన్మనివ్వడం...జైలు జీవితం...ఆటుపై ఉరి ఇలా చెప్పుకుంటే దీపిక పాత్ర గెస్ట్ పాత్రని మించి కీలక పాత్ర అని అనాలి.
అందుకోసం డేట్లు కూడా ఎక్కువగానే కేటాయించి ఉండొచ్చు. మరి దీపిక అందుకున్న పారితోషికం ఎంతంటే? అమ్మడు షాక్ అయ్యే విషయం రివీల్ చేసింది. ఈ సినిమాకి ఒక్క రూపాయి కూడా తీసుకోలే దుట. షారుక్ పై ఉన్న అభిమానంతో ఉచితంగా నటించినట్లు తెలిపింది. సాధారణంగా తానెప్పుడు గణాంకాలకు ఆర్షితురాలు కాదని..చేతిలో సినిమాలు ఉండాలని కోరుకుంటాను తప్ప! ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చారు? అన్న విషయాలు ఎప్పుడూ పట్టించుకోదుట.
షారుక్ సినిమాలో ఎప్పుడు అతిది పాత్ర కోసం అడిగానా తానెప్పుడు సిద్దంగానే ఉంటానని తెలిపారు. షారుక్ తో దీపిక స్నేహం గురించి తెలిసిందే. అమ్మడు షారుక్ ఖాన్ సినిమాతోనే బాలీవుడ్ లో అడుగు పెట్టింది. 'ఓమ్ శాంతి ఓమ్' సినిమాలో తొలిసారిగా షారూక్ ఖాన్ తో నటించింది. ఆ తర్వాత 'హ్యాపీ న్యూ ఇయర్'.. 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రాల్లోనూ కలసి నటించారు. ఆ సినిమాలన్ని మంచి విజయం సాధించాయి. పాన్ ఇండియాలో ఈ సక్సెస్ ఫుల్ జోడీకి మంచి క్రేజ్ ఉంది. 'జవాన్' కంటే ముందు రిలీజ్ అయిన 'పఠాన్' చిత్రంలోనూ నటించింది. అదీ 1000 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది.