Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ తెచ్చిన క్యారేజీలే ఈ బంప్‌కి కార‌ణం?

ఈ కార్యక్రమానికి ముందు దీపిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో స్లీక్ బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో క‌నిపించింది.

By:  Tupaki Desk   |   20 Jun 2024 12:53 PM GMT
ప్ర‌భాస్ తెచ్చిన క్యారేజీలే ఈ బంప్‌కి కార‌ణం?
X

దీపిక టైమింగ్ గురించి టైమింగ్ సెన్స్ గురించి సెన్సాఫ్ హ్యూమ‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కల్కి 2898 AD ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దీపికా పదుకొణె జోకులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జ‌నం దృష్టి దీపిక బేబి బంప్ పై కేంద్రీకృతం కాగా.. త‌న‌కు అంత పెద్ద పొట్ట‌(బేబి బంప్) పెర‌గ‌డానికి కార‌ణం.. ప్ర‌భాస్ ఇంటి నుంచి తెచ్చిన క్యారేజీలేన‌ని జోక్ చేసారు. ప్ర‌భాస్ ఇంటి నుంచి వ‌చ్చిన క్యారేజీలు అబ‌గా లాగించేద‌ట‌...అందుకే పొట్ట పెరిగింద‌ని స‌ర‌దాగా జోక్ చేసింది. దీపిక వ్యాఖ్య‌ల‌కు వీక్ష‌కులు ఫుల్ గా న‌వ్వుకున్నారు. దీపిక ఈ వేదిక‌పై బ్లాక్ క‌ల‌ర్ బాడీ ఫిట్ ఫ్రాక్ ధ‌రించగా త‌న బేబి బంప్ స్ప‌ష్ఠంగా క‌నిపించింది. అది అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ వేడుక‌లో క‌ల్కి గురించి, ఇందులో త‌న‌ పాత్ర గురించి మాట్లాడటానికి వేదికపైకి వెళ్ళిన దీపిక తన సహనటుడు ప్రభాస్‌తో సరదా స‌మ‌యం గురించి, అత‌డు అందించే ఆహారంతో అనుబంధం గురించి వెల్ల‌డించింది. సెట్‌లో ప్రభాస్ తినిపించిన‌ అద్భుతమైన ఆహారమే తన బంప్‌కు కారణమని దీపిక‌ సరదాగా చెప్పింది. తన న‌డుము ఫ్యాట్ తో కనిపించడానికి అతడే కారణమని చమత్కరించింది. ప్రభాస్ నాకు తినిపించిన ఆహారాల వల్ల నేను నిజంగా ఇలా ఉన్నాను అని అంది. దీపిక‌ వ్యాఖ్యకు ప్ర‌భాస్ ప‌డి ప‌డీ న‌వ్వాడు. అస‌లు నవ్వు ఆపుకోలేకపోయాడు. కేవలం ఆహారం అందించ‌డ‌మే కాదు.. సెట్లో అత‌డి వ్య‌వ‌హారం పూర్తి క్యాటరింగ్ సర్వీస్ అనే స్థాయికి చేరుకుంది. ఇంటి నుండి తెచ్చిన ఆహారాన్ని త‌న‌ హృదయంతో మాకు అందించాడు అని దీపిక త‌న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.

ఈ కార్యక్రమానికి ముందు దీపిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో స్లీక్ బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో క‌నిపించింది. ''సరే చాలు... ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది!'' అని త‌న‌ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. దీని ఉద్ధేశం ప్ర‌భాస్ ఇంటి నుంచి క్యారేజీ వ‌స్తుంద‌ని!! అంటూ అభిమానులు జోక్ చేసారు.

దీపిక వ్య‌క్తిగ‌త జీవితంలో ఫుల్ హ్యాపీగా ఉంది. రణవీర్ సింగ్ తో దీపిక‌ ఫిబ్రవరి 29 న తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. వారు సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మనిస్తారని కూడా పేర్కొన్నారు.

రణవీర్-దీపిక ఆరు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత 14 నవంబర్ 2018న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించడం.. వారి అనుబంధం అనుచ‌రుల‌కు స్ప‌ష్ఠంగా తెలుసు.

కల్కి 2898 AD తర్వాత రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ మూడవ సీజ‌న్ అయిన 'సింగం ఎగైన్‌'లో అభిమానులు దీపికను చూస్తారు. అజయ్ దేవగన్, కరీనా కపూర్, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్‌లతో కలిసి లేడీ సింగం పాత్రలో దీపిక క‌నిపించ‌నుంది.