Begin typing your search above and press return to search.

బేబి బంప్ ఫేక్ అన్న‌వాళ్ల‌కు ఇచ్చి ప‌డేసిన దీపిక‌

దీపికా పదుకొణె తన ఓటు వేయడానికి బయటికి వచ్చినప్పుడు ట్రోలింగుకి గురైంది. కొన్ని వారాల తర్వాత ఇప్పుడు బేబి బంప్ తో దీపిక బ‌హిరంగ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది.

By:  Tupaki Desk   |   19 Jun 2024 5:07 PM GMT
బేబి బంప్ ఫేక్ అన్న‌వాళ్ల‌కు ఇచ్చి ప‌డేసిన దీపిక‌
X

దీపికా పదుకొణె ఎట్టకేలకు తన బేబీ బంప్‌ను ప్రశ్నించే ట్రోల‌ర్ల‌కు చెక్ పెట్టింది. రణవీర్ సింగ్‌తో తన మొదటి బిడ్డను ఆశిస్తున్న డీపీ బుధవారం సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్ లో అద్బుత‌మైన ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఇందులో దీపిక‌ తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ కనిపించింది. అస్పష్టంగా ఉన్న ఫోటోలో దీపిక ముఖం కనిపించలేదు కానీ బ్లాక్ హ‌గ్గింగ్ దుస్తులలో దీపిక కెమెరాల‌కు పోజులిచ్చింది. బేబీ బంప్ కూడా స్పష్టంగా కనిపించింది.

దీపికా పదుకొణె తన ఓటు వేయడానికి బయటికి వచ్చినప్పుడు ట్రోలింగుకి గురైంది. కొన్ని వారాల తర్వాత ఇప్పుడు బేబి బంప్ తో దీపిక బ‌హిరంగ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది. గ‌తంలో నెటిజన్లలో ఒక వర్గం ఆమె బేబీ బంప్‌ను ఫేక్ అని కామెంట్ చేసారు. మే 20న ముంబై లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ 2024లో ఓటు వేయడానికి వచ్చినప్పుడు విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంది. ఆ స‌మ‌యంలో బేబీ బంప్ గురించి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసినవారికి ఇప్పుడు చెంప పెట్టు లాంటి స‌మాధానం ఇచ్చింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే దీపికా పదుకొనే న‌టించిన మోస్ట్ అవైటెడ్ క‌ల్కి చిత్రం ఈనెలాఖ‌రున విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ముంబైలో నేటి సాయంత్రం జ‌రిగిన ప్ర‌చార ఈవెంట్లో పాల్గొన్న దీపిక ప‌దుకొనే వేదిక‌పై కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఈ వేదిక‌పైనా దీపిక బేబి బంప్ బ‌య‌ట‌ప‌డింది. అది కూడా బ్లాక్ ఫ్రాక్ లో దీపిక త‌న బేబి బంప్ ని ప్ర‌ద‌ర్శించింది.