Begin typing your search above and press return to search.

బాలిలో బిగ్ బాస్ పిల్ల.. కిర్రాక్ అనేలా..

సోషల్ మీడియా వల్ల ఎందరో అమ్మాయిలు.. సెలబ్రిటీలుగా మారిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Sep 2024 3:17 PM GMT
బాలిలో బిగ్ బాస్ పిల్ల.. కిర్రాక్ అనేలా..
X

సోషల్ మీడియా వల్ల ఎందరో అమ్మాయిలు.. సెలబ్రిటీలుగా మారిన విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. వారిలో దీప్తి సునైనా ఒకరు. టిక్ టాక్ ద్వారా మంచి పాపులర్ అయిన అమ్మడు.. ఆ తర్వాత ప్రైవేట్ ఆల్బమ్స్ తో యూట్యూబర్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ బాగా చేరువైంది. అలా వచ్చిన క్రేజ్ తో వివిధ షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. తన అందం, అభినయంతో స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది సునైనా.


సోషల్ మీడియా ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న దీప్తి.. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టే ఛాన్స్ అందుకుంది. సీజన్ 2లో పాల్గొని తన ఆటతీరుతో మెప్పించింది. ఓ టాస్క్ లో భాగంగా జుట్టు కూడా కట్ చేసుకుని తన డెడికేషన్ ఏంటో చూపించింది. విన్నర్ కాకపోయినా అనేక మంది హృదయాలు గెలుచుకుంది. తన ఫ్యాన్ బేస్ ను విపరీతంగా పెంచుకుంది. అయితే బిగ్ బాస్ తర్వాత ఆమెకు మంచి సినిమా అవకాశాలు వస్తాయని అంతా అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు.


కానీ అలా ఏం జరగలేదు. చాలా ఏళ్ల క్రితం యంగ్ హీరో నిఖిల్ నటించిన కిరాక్ పార్టీ మూవీలో చిన్న రోల్ లో తళుక్కుమంది. అయితే యూట్యూబర్ షణ్ముఖ్ తో కొన్నాళ్లపాటు ప్రేమలో మునిగితేలిన అమ్మడు.. ఆ సమయంలో అనేక వెబ్ సిరీసులు, సాంగ్స్ అతడితో చేసింది. అప్పుడు షణ్ముఖ్ పేరులోని లెటర్ ను టాటూగా కూడా వేసుకుంది. బ్రేకప్ తర్వాత దానిని కవర్ చేసింది. ఆ మధ్య మరో యువకుడితో లవ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.


అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది అమ్మడు. రకరకాల ఫోటో షూట్స్ తో ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ ను అలరిస్తుంటోంది. హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని అందంతో సందడి చేస్తుంటోంది. ఆమె పిక్స్ పోస్ట్ చేస్తే చాలు.. క్షణాల్లో ఫుల్ వైరల్ అయిపోతుంటాయి. అంతలా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది అమ్మడు. రోజురోజుకూ పెంచుకుంటోంది కూడా. తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది బ్యూటీ.


ప్రస్తుతం బాలి ట్రిప్ లో ఉన్న అమ్మడు.. అక్కడ దిగిన ఫోటోస్ పోస్ట్ చేసింది. పొట్టి బట్టలతో ఫుల్ ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. ఓ చోట క్యూట్ గా.. మరో చోట హీటు పుట్టించే విధంగా కనిపిస్తోంది. స్టన్నింగ్ లుక్స్ తో మైమరిపిస్తోంది. అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటోంది. ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అమ్మడి పిక్స్ అదిరిపోయాయాని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీప్తి ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ సందడి చేస్తున్నారు. కిర్రాక్ పిక్స్ అని చెబుతున్నారు.