Begin typing your search above and press return to search.

డిమాంటి కాలనీ 2 ప్రీమియర్ టాక్..!

జోనర్ ఏదైనా సరే ఒక సినిమా హిట్ కాగానే దానికి కొనసాగింపుగా మరో సినిమా రావడం ఈమధ్య చాలా కామన్ అయ్యింది.

By:  Tupaki Desk   |   22 Aug 2024 8:30 AM GMT
డిమాంటి కాలనీ 2 ప్రీమియర్ టాక్..!
X

జోనర్ ఏదైనా సరే ఒక సినిమా హిట్ కాగానే దానికి కొనసాగింపుగా మరో సినిమా రావడం ఈమధ్య చాలా కామన్ అయ్యింది. ముఖ్యంగా ఈ పంథాను హర్రర్ సినిమాలు ఎక్కువ ఫాలో అవుతున్నాయి. ప్రేక్షకులను ఎంత భయపెడితే అంత హిట్ అనేలా ఈ సినిమాలు ఉంటాయి. ఇక ట్విస్టులు, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఇవన్ని హర్రర్ సినిమాలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆల్రెడీ హిట్ అయిన ఒక హర్రర్ సినిమా కు ఈమధ్యనే మరో సీక్వెల్ తెరకెక్కించారు. అది తమిళంలో రిలీజై మంచి టాక్ తెచ్చుకోగా ఈ శుక్రవారం తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

2015లో రిలీజైన డిమాంటి కాలనీ సినిమా హర్రర్ జోనర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అరుల్ నిథి లీడ్ రోల్ లో నటించారు. ఐతే ఆ సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ 9 ఏళ్లకు డిమాంటి కాలనీ సీక్వెల్ తెరకెక్కించారు. ఈ సీక్వెల్ ని కూడా అజయ్ జానముత్తు డైరెక్ట్ చేయగా అరుల్ నిథి, ప్రియా భవాని శంకర్ లీడ్ రోల్ లో నటంచారు.

శుక్రవారం రిలీజైన కొంతమంది సెలెక్టెడ్ ఆడియన్స్, మీడియా ఇంకా కొందరు సెలబ్రిటీస్ కు ప్రీమియర్స్ వేశారు. సినిమా రిలీజ్ ముందు ప్రీమియర్ వేసి సినిమా గురించి పబ్లిసిటీ చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఐతే డిమాంటి కాలనీ 2 మొదటి పార్ట్ తో పోల్చుకుంటే ఆ రేంజ్ అంచనాలను అందుకోలేదని చెప్పొచ్చు. హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా ప్రేక్షకులను భయపెట్టడంలో మాత్రం విఫలమైందని చెప్పొచ్చు. వి.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ కూడా అంత గొప్పగా ఏమీ లేవు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సినిమా మూడ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ట్రాక్ తప్పేసింది.

బౌద్ధ సన్యాసులు భూత వైద్యులుగా చూపించిన సన్నివేశాలు కాస్త బాగున్నా అవి సినిమాకు అంతగా ఉపయోగపడలేదు. అరుల్ నిథి, ప్రియా భవాని శంకర్ ఇద్దరు లీడ్ స్టార్స్ తమ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. సస్పెన్స్, హర్రర్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో చాలా అందుబాటులో ఉన్నాయి. సీట్ ఎడ్జ్ సస్పెన్స్, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఉంటేనే ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందుతాయి. డిమాంటి కాలనీ 2 అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఐతే హర్రర్ జోనర్ సినిమాలు చూసే ఆడియన్స్ ఆ ఎక్స్ పీరియన్స్ పొందేందుకు మాత్రం ఒకసారి చూసే ఛాన్స్ ఉంది.