Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో డియోల్ బ్ర‌ద‌ర్స్ హ‌వా

అవును.. ఇది అనూహ్యం! ఉన్న‌ట్టుండి ఫేడ‌వుట్ హీరోలు సైలెంట్ గా దూసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 3:37 AM GMT
టాలీవుడ్‌లో డియోల్ బ్ర‌ద‌ర్స్ హ‌వా
X

అవును.. ఇది అనూహ్యం! ఉన్న‌ట్టుండి ఫేడ‌వుట్ హీరోలు సైలెంట్ గా దూసుకొచ్చారు. తిరిగి వారి స్టార్ డ‌మ్ ని వెన‌క్కి తెచ్చారు. ఇప్పుడు అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల్లో వీళ్ల పేర్లు మార్మోగుతున్నాయి. అటు హిందీ చిత్ర‌సీమ స‌హా టాలీవుడ్, కోలీవుడ్ లో వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ఇంత‌కీ ఎవ‌రీ బ్ర‌ద‌ర్స్ అంటే.. డియోల్ బ్ర‌ద‌ర్స్ స‌న్నీడియోల్- బాబి డియోల్. వెట‌ర‌న్ స్టార్ ధ‌ర్మేంద్ర పుత్ర‌ర‌త్నాలు ఆ ఇద్ద‌రూ.

ఇక వీళ్ల ప‌నైపోయింది అనుకున్న త‌రుణంలో గ్రేట్ కంబ్యాక్ అంటే ఏమిటో ఈ బ్ర‌ద‌ర్స్ చూపించారు. రీఎంట్రీలో డియోల్ సోద‌రులు దుమ్ము దులిపేస్తున్నారు. బాబి డియోల్ `యానిమ‌ల్` చిత్రంలో అబ్రార్ గా న‌టించి అంద‌రి మెప్పు పొందాడు. ఆ త‌ర్వాత అత‌డికి అవ‌కాశాలు వెల్లువెత్తాయి. ఇటీవ‌ల టాలీవుడ్ అగ్ర హీరోలు బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ (హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు)ల క్రేజీ చిత్రాల్లో విల‌న్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అటు త‌మిళంలో సూర్య న‌టిస్తున్న పాన్ ఇండియ‌న్ సినిమా కంగువ‌లో ప్ర‌తినాయ‌క పాత్ర‌లో బాబి న‌టిస్తున్నాడు. ఇవే గాక అత‌డు ప్ర‌స్తుతం సౌత్ లో మ‌రిన్ని క‌థ‌ల్ని వింటున్నారు.

ఇలాంటి స‌మ‌యంలోనే స‌న్నీడియోల్ గ‌ద‌ర్ 2తో రీబూట్ అయ్యి, ఇప్పుడు అత‌డు తెలుగులో ఒక స్ట్రెయిట్ సినిమాలో న‌టించేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం కోసం స‌న్నీడియోల్ లాంటి అగ్ర హీరోని ఎంపిక చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. గోపిచంద్ మ‌లినేని ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక డియోల్ బ్ర‌ద‌ర్స్ అనుబంధం గురించి ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

సన్నీ డియోల్ - బాబీ డియోల్ ఒకరికొకరు ప్రేమ ఆప్యాయ‌త‌ల‌ను క‌న‌బ‌ర‌చ‌డ‌మే కాదు.. ఒక‌రికొక‌రు గౌరవించుకోవ‌డం అభినందించుకోవ‌డంలో ఈ బ్ర‌ద‌ర్స్ అనుబంధం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఇటీవ‌ల‌ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కొత్త‌ ఎపిసోడ్‌లో వారి సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకున్నాయి. డియోల్ బ్ర‌ద‌ర్స్ `బ్రోమాన్స్` గురించి స్నీక్ పీక్ వైర‌ల్ అయింది.

బాబీ సూపర్‌మ్యాన్ అంటూ స‌న్నీ గురించి గొప్పగా మాట్లాడాడు. నిజ జీవితంలో సూపర్‌మ్యాన్ వంటి బలమైన వ్యక్తి ఎవరైనా ఉంటే అది నా సోదరుడు. అతడి కంటే బలమైన వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. అతడు అనేకసార్లు వెన్నునొప్పి శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. అయినప్పటికీ అతడు ఒక పాత్ర కోసం ఒకరిని ఎత్తి విస‌రాల్సి వచ్చినప్పుడు వెన‌కాడ‌డు. తమాషా ఏమిటంటే అవ‌త‌లివాళ్లు మిగ‌ల‌రు అనేంత‌గా అది చేసి చూపిస్తాడు! అని అన్నారు.

అలాగే డియోల్ కుటుంబం భారీ విజయాన్ని సాధించిన సంవత్సరం 2023 గురించి మాట్లాడుతూ సన్నీడియోల్ ఎంత‌గానో ఉద్వేగానికి గుర‌య్యారు. కరణ్ జోహార్ విజయవంతమైన చిత్రం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో ధర్మేంద్ర ఆ ఏడాది ప్రేక్షకులను ఆకర్షించాడు. అయితే గదర్ 2 విజయం .. యానిమల్ లో అబ్రార్ పాత్ర‌కు గొప్ప స్పంద‌న లభించడం సన్నీ - బాబీల కెరీర్‌లో పునరుజ్జీవనంగా భావించారు. బాబి ఇటీవ‌ల హిందీలో ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్ ల‌లోను న‌టిస్తూ బిజీగా ఉన్నాడు.

మరోవైపు సన్నీ డియోల్ ప్రస్తుతం రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో లాహోర్ 1947 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. లాహోర్ 1947 సన్నీ డియోల్ - అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మధ్య క‌ల‌యిక కాబ‌ట్టి ఆస‌క్తిని రేకెత్తించింది. ఇందులో ప్రీతీ జింటా, కరణ్ డియోల్, అలీ ఫజల్, షబానా అజ్మీ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.