దేవకట్టా మరో సినిమాతో ఇదే ఏడాదా?
దేవకట్టా నుంచి సినిమా రిలీజ్ అయి అయిదేళ్లవుతుంది. `రిపబ్లిక్ డే `తర్వాత ఇంత వరకూ కొత్త సినిమా ప్రకటన రాలేదు. కమర్శియల్ డైరెక్టర్ గా దేవకట్టా ప్రూవ్ చేసుకోలేకపోవడంతోనే అవకాశాలకు దూరమవ్వాల్సి వచ్చింది.
By: Tupaki Desk | 27 Feb 2025 6:30 AM GMTదేవకట్టా నుంచి సినిమా రిలీజ్ అయి అయిదేళ్లవుతుంది. `రిపబ్లిక్ డే `తర్వాత ఇంత వరకూ కొత్త సినిమా ప్రకటన రాలేదు. కమర్శియల్ డైరెక్టర్ గా దేవకట్టా ప్రూవ్ చేసుకోలేకపోవడంతోనే అవకాశాలకు దూరమవ్వాల్సి వచ్చింది. తొలుత ఆయన వెన్నెల సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాగానే ఆడింది. అటుపై `ప్రస్థానం` సినిమాతో దర్శకుడిగా అతడికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది.
విమర్శకుల ప్రశంసలే కాదు..ఇండస్ట్రీ మెచ్చిన చిత్రంగా నిలిచింది ప్రస్థానం. ఆ సినిమా తర్వాత దేవకట్ట గొప్ప దర్శకుడవుతాడని ఇండస్ట్రీ బలంగా నమ్మింది. కానీ ఆ సినిమా కమర్శియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఈ కోణంలో అవకాశాలు పెద్దగా రాలేదు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ `ఆటోనగర్ సూర్య` చేసాడు. ఇది కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుని రిలీజ్ అయింది. ఫలితం ఆశించిన విధంగా రాలేదు.
ఆ తర్వాత `ప్రస్థానం` సినిమాకి రీమేక్ చేసారు. ఆ సినిమా పెద్దగా ప్రచారంలోకి కూడా రాలేదు. ఆ తర్వాత `రిపబ్లిక్` 2019లో రిలీజ్ అయింది. `బాహుబలి`కి ప్రీక్వెల్ ని వెబ్ సిరిస్ గా తీసే ప్రయత్నాల్లో దేవకట్టా పేరు వినిపించింది. కానీ అది మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత దేవకట్ట పేరు ఎక్కడా వినిపించలేదు. దీంతో ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడా? అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.
అయితే తాజాగా దేవకట్టా ఆదిపినిశెట్టితో ఓ సినిమా చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆది చెప్పడంతోనే విషయం తెలిసింది. `మయసభ` అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఇదే ఏడాది రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా దేవకట్టా సరైన విజయం అందుకుంటాడా? లేదా? అన్నది చూడాలి.