అనురాగ్ ఫిలిం మేకింగ్ క్లాస్ షేర్ చేసిన దేవాకట్టా
ఆ స్క్రిప్టుని చాలామంది ఔత్సాహిక ఫిలింమేకర్స్ డౌన్ లోడ్ చేసుకుని స్టడీ చేసారు.
By: Tupaki Desk | 27 March 2025 12:30 AMటాలీవుడ్ లో మొట్టమొదటిసారి ఆన్ లైన్ లో స్క్రిప్టును షేర్ చేసిన దర్శకుడు దేవా కట్టా. అతడు తన విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రస్థానం సినిమా స్క్రిప్ట్ ని ఆన్ లైన్ లో షేర్ చేసారు. ఆ స్క్రిప్టుని చాలామంది ఔత్సాహిక ఫిలింమేకర్స్ డౌన్ లోడ్ చేసుకుని స్టడీ చేసారు.
ఇప్పుడు `అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా` విద్యార్థులకు ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ క్లాస్ చెబుతున్న వీడియో లింక్‌ని ఇప్పుడు దేవా కట్టా షేర్ చేసారు. చాలా సుదీర్ఘంగా ఉన్న ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా విజ్ఞానదాయకంగా సాగింది. అనురాగ్ తన నాలెడ్జ్ ని ఇతరులకు షేర్ చేయడానికి ఏమాత్రం భేషజం చూపించలేదు. అతడు విలువైన సలహాలెన్నో ఔత్సాహిక ఫిలింమేకర్స్ కోసం అందించారు.
తాను దర్శకుడిగా ఫెయిలైనా సుదీర్ఘ కాలం కొనసాగుతున్నానంటే దానికి కారణం ఫిలింమేకింగ్ పై ఫ్యాషన్ మాత్రమేనని తెలిపాడు. ఎవరైనా సినిమాల్లోకి రావాలని అనుకుంటే, ధైర్యంగా అడుగు వేసేయాలి. అక్కడ తిండి దొరుకుతుందా లేదా? ఉండటానికి ఏదైనా షెల్టర్ ఉంటుందో లేదో! అంటూ ఆలోచిస్తూ కూచుంటే ఫిలింమేకర్ కాలేరు. ధైర్యంగా మొదటి అడుగు వేయడంతోనే ఏదైనా సాధ్యం అని తెలిపారు. సినిమా జయాపజయాలకు వెరవక ఇక్కడ ప్రయాణించాల్సి ఉంటుందని విద్యార్థులకు చెప్పారు.
అలాగే ఎవరైనా ప్రస్తుతంలో జీవించాలి. కోల్పోయిన గతం గురించి కానీ, భవిష్యత్ గురించి కానీ ఎక్కువగా గుర్తు చేసుకున్నా లేదా ఊహించుకున్నా చింతల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రస్తుతాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి? అనేది ఒక్కటే గుర్తు పెట్టుకోవాలని కూడా అనురాగ్ సూచించారు. ఇక కాలేజ్ స్టూడెంట్స్ తో ఫిలింమేకింగ్ శైలిపై పలు విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు.
ఫిలింమేకింగ్ పై అనురాగ్ క్లాస్ నెటిజనులకు విపరీతంగా నచ్చేసింది. ఆయన కొత్త కుర్రాళ్ల కోసం విలువైన సూచనలు ఎన్నో ఇచ్చారు. అనురాగ్ ఏమి చేసినా, అతడు చేసే ఏ ఇంటర్వ్యూ అయినా చూస్తాను. అతడు చెప్పే ప్రతి వాక్యంతో తన నోటి నుండి జ్ఞానం, ఆణి ముత్యాలు వెలువడతాయి. ఒక సినిమాటిక్ మేధావి... అని ఒక అభిమాని పొగిడేసారు.
అనురాగ్ కశ్యప్ చాలా కాలం ప్రయత్నించాక.. ప్రతి సినిమా విడుదలైనా.. విడుదల కాకపోయినా, షక లక బూమ్ బూమ్‌లో కూడా అతని స్క్రిప్ట్ రైటింగ్ ప్రయాణం గురించి, డబ్బు కోసం చాలా గంటలు స్నేహం గురించి మాట్లాడతారు. 90లలో అతని సంబంధం గురించి.. ఇప్పుడు గంటల తరబడి, పుస్తకాలను సమీక్షించడం గురించి, ప్రతి రచయిత , దర్శకుడి గురించి అతడు అర్థం చేసుకున్నదాని గురించి, ఎవరూ చూడని చిత్రాల గురించి, ఎవరూ గంటల తరబడి చూడని లేదా వినని చిత్రాల గురించి అతడు మాట్లాడుతాడని ఒక నెటిజన్ ప్రశంసలు కురిపించారు. అనురాగ్ కశ్యప్ ఇటీవల హిందీ పరిశ్రమను వదిలేసి సౌత్ లో సెటిలయ్యారు. ప్రస్తుతం అతడి దృష్టి సౌత్ సినిమాల్లో నటించడం, అలాగే రచన దర్శకత్వంపైనే!!