'దేవా' కోసం మూడు క్లైమాక్స్‌లు
ఓ ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ ఈ చిత్రం చేయడానికి అంగీకరించడానికి ప్రధాన కారణాలలో క్లైమాక్స్ ఒకటి అని వెల్లడించారు. ఈ ప్రకటన మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది.
By: Tupaki Desk | 24 Jan 2025 2:45 AM GMTఏదైనా సినిమా హిట్టవ్వాలంటే కొన్ని ప్రాథమిక సూత్రాలను అనుసరించాలి. మొదటి అర్థగంటలోనే థియేటర్లలో ఆడియెన్ ని కథలో లీనమయ్యేలా చేయడం.. ప్రీఇంటర్వల్, ఇంటర్వెల్ ట్విస్టు, ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ లతో గ్రాఫ్ ని అమాంతం పైకి తీసుకెళ్లడం సినిమాకి కీలకం. మంచి నేపథ్య సంగీతం, కళ్లు తిప్పుకోనివ్వని స్క్రీన్ ప్లే కూడా చాలా ముఖ్యం.
షాహిద్ కపూర్ కొత్త చిత్రం 'దేవా' కోసం ఫార్ములాను బ్రేక్ చేయలేదని అర్థమవుతోంది. ఇటీవలే విడుదలైన దేవా ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ ఎపిసోడ్స్ తో రక్తి కట్టించింది. నిజానికి దేవా ఫస్ట్ లుక్ దశ నుంచే అంచనాలు పెంచడంలో సఫలమైంది. అద్భుతమైన ట్రైలర్‌తో అందరి అంచనాలను పెంచగలిగారు. రోషన్ ఆండ్రూస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించింది.
ఓ ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ ఈ చిత్రం చేయడానికి అంగీకరించడానికి ప్రధాన కారణాలలో క్లైమాక్స్ ఒకటి అని వెల్లడించారు. ఈ ప్రకటన మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది. ఆసక్తికరంగా ముంబై వర్గాల సమాచారం మేరకు.. మేకర్స్ ఒకటికి మించి క్లైమాక్స్‌లను చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఏది చేర్చాలో ఇంకా ఆలోచిస్తున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ అందరినీ షాక్‌కు గురి చేస్తుందని కథనాలొస్తున్నాయి.
షాహిద్ ఈ చిత్రంలో ఒక బ్యాడ్ కాప్ పాత్రలో అద్భుతంగా కుదిరాడు. అతడి నటన, ఆహార్యం చాలా స్టైలిష్ గా మాసీగా ఆకట్టుకుంటోంది. పూజాహెగ్డే చక్కని నటనను ప్రదర్శించింది. ఈ బ్యూటీ మంచి విజయం కోసం వేచి చూస్తోంది. ఇలాంటి సమయంలో దేవా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలన్న ఉత్కంఠ నెలకొంది.